నీట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.

 జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. 

నీట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి.

 లోకల్ గైడ్ .  నల్లగొండ

       నీట్ ప్రవేశ పరీక్షకు అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా కేంద్రం, అలాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన నీట్ ప్రవేశ పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి తనిఖీ చేశారు.ముందుగా జిల్లా కేంద్రంలోని రామగిరి లో ఉన్న మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి అక్కడ సౌకర్యాలను, బందోబస్తు ఏర్పాట్లను తనిఖీ చేశారు. అనంతరం ఎంజి యూనివర్సిటీలో  ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు .
కాగా నీట్ అండర్ గ్రాడ్యుయేట్ -2025 ప్రవేశ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా  7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 7 కేంద్రాలు నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఉన్నాయి. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో 4 పరీక్ష కేంద్రాలు, ఎన్జీ కళాశాలలో ఒకటి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఒకటి, కేంద్రీయ విద్యాలయలో మరొక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 2087 మంది అభ్యర్థులు నీట్ ప్రవేశ పరీక్షకు హాజరుకానున్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహణలో భాగంగా పరీక్ష కేంద్రాలలో ఏర్పాట్లను ఆమె తనిఖి చేయడమే కాక పరీక్ష కేంద్రాల సూపరింటిండెంట్లు,నోడల్ అధికారి, సంబంధిత శాఖల అధికారులకు మరోసారి ఆదేశాలు జారీ చేశారు. పరీక్షరాసే అభ్యర్థులు ఉదయం 11 గంటలకు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆమె కోరారు. మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత పరీక్ష కేంద్రం ప్రధాన గేట్లను మూసివేయడం జరుగుతుందని పునరుద్ధరించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు. పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులు అన్నింటిని మరోసారి పరిశీలించుకోవాలని ముఖ్యంగా తాగు నీరు, విద్యుత్, ఫ్యాన్లు, మెడికల్ సౌకర్యాలు ,తదితర అన్నింటిని పునః పరిశీలించాలని  తెలిపారు. 
    జిల్లా ఎస్పీ చంద్ర పవర్ ,స్థానిక సంస్థల ఇంచార్జ్  అదనపు కలెక్టర్ రాజ్ కుమార్, అడిషనల్ ఎస్పీ రమేష్, నల్గొండ ఆర్డీవో వై .అశోక్ రెడ్డి, డిఎస్పి శివరాం రెడ్డి ,నీట్ నోడల్ ఆఫీసర్ ,కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ శ్రీనివాసులు ,తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News