జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

కుల గణన కోసం దేశ వ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పాటు...
లోక‌ల్ గైడ్ :
దేశవ్యాప్తంగా జనగణననతో పాటు కులగణన  చేస్తామంటూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేంద్ర నిర్ణయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. కులగణన నిర్ణయం విషయంలో రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేశారు. కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారని.. రాహుల్ పాదయాత్రలో కుల గణనపై చర్చ చేశారన్నారు. కుల గణన చేయాల్సిందేనని రాహుల్ తేల్చి చెప్పారని తెలిపారు. కేంద్రం నిర్ణయంపై రాజకీయాలు మాట్లాడదల్చుకోలేదని వెల్లడించారు.కుల గణనపై తెలంగాణ రాష్ట్రానికి అవగాహన ఉందన్నారు. కుల గణన కోసం దేశ వ్యాప్తంగా ఒక కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కులం ఒక్కో జాబితాలో ఉందని తెలిపారు. కుల గణన కోసం మంత్రులతో ఒక కమిటీ ఏర్పడి చేయాలని.. అధికారులతో, నిపుణులతో ఒక కమిటీ వేసి అధ్యయనం చేయాలని సూచించారు. కులగణన కోసం తెలంగాణ మోడల్‌ను ఆదర్శంగా తీసుకోవాలని కేంద్రానికి తెలిపారు. మంత్రుల కమిటీ వెంటనే నియమించాలన్నారు. మంత్రుల కమిటీకి తోడుగా నిపుణుల కమిటీని వేయాలన్నారు. ఈ రెండు కమిటీలతో దేశవ్యాప్తంగా అధ్యయనం చేయించాలని తెలిపారు. 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 ఫలితాలను వెల్లడించిన త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్  ఫలితాలను వెల్లడించిన త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్
'పది'ఫలితాలలో త్రివేణి విజయభేరి 
సామ్రాజ్యవాద శక్తుల చేతిలో మగ్గుతున్న శ్రామికవర్గాన్ని రక్షించేది 'ఎర్ర జెండానే'
పని గంటలను పెంచనివ్వం: - సీఐటీయూ
శివాలయం పునర్ నిర్మాణానికి 75వేల విరాళం అందజేసిన బండ్ల రాజశేఖర్ రెడ్డి
జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అక్షయ తృతీయ నాడు ఒడిశా 51 లక్షల మంది రైతుల ఖాతాకు ₹1025 కోట్లు బదిలీ 
మారుమూల ఆదివాసి గ్రామాల్లో  మెరుగైన వైద్యం సౌకర్యవంతంగా చూడాలి.