ఫలితాలను వెల్లడించిన త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్

 స్టేట్  4వ ర్యాంక్ సాధించిన త్రివేణి విద్యార్థి

 ఫలితాలను వెల్లడించిన త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్

'పది'ఫలితాలలో త్రివేణి విజయభేరి 

కొత్తగూడెం లోకల్ గైడ్ : ఎస్.ఎస్.సి ఫలితాలలో ఎప్పటిలాగే త్రివేణి విద్యార్థులు తమ సత్తా చాటారు. టాప్ మార్కులను సాధించి తమ ప్రతిభను చూపారు. ప్రగతి ఫలాల తెలంగాణాలో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో త్రివేణి విద్యార్థులు విజయదుంధిభి మ్రోగించారు. ఈ సందర్భంగా కొత్తగూడెంలో త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్ పత్రిక ప్రకటనను విడుదల చేశారు. తమ విద్యార్థులు గత ఎస్.ఎస్.సి గ్రేడుల్లో మేమే, నేటి మార్కుల్లో కూడా మా త్రివేణి ముందంజలో ఉందని నిరూపించుకుంది. ఎస్ఎస్సి మార్కుల ప్రకారం 600కి మార్కులు 593 మా విద్యార్థిని ఆర్. రిషిక శ్రీ స్టేట్ 4వ ర్యాంకు సాధించినదని తెలిపారు. ఇవే కాకుండా, 580 ఆ పైన సాధించిన వారు 22 మంది, 570 పైన సాధించినవారు 42 మంది సాధించి రాష్ట్రస్థాయిలో ఉత్తమమైన ఫలితాలు సాధించి త్రివేణిని మొదటి స్థానంలో నిలిపారు.కొత్తగూడెంలోని త్రివేణి హైస్కూల్లో 600కి గాను 593 మార్కులను సాధించి కొత్తగూడెం త్రివేణి ఖ్యాతిని చాటిచెప్పారు, 580 పైన నలుగురు, 570 పైన 19 మంది, 560 పైన 35 మంది, 550 పైన 58 మంది సాధించారని డైరెక్టర్ గొల్లపూడి జగదీష్ తెలిపారు. కొత్తగూడెం పట్టణంతో పాటు. జిల్లా, రాష్ట్రస్థాయి లో తన కంటూ ఒక ప్రత్యేకతను త్రివేణి కలిగి ఉందన్నారు. అనుభవం, అంకితభావంగల బోధనా సిబ్బంది ఉండటంవలన ఈ సంచలన విజయాలు సాధించడం సాధ్యమైందని పేర్కొన్నారు.విజయం సాధించిన విద్యార్థులకు త్రివేణి పాఠశాలల డైరెక్టర్స్  గొల్లపూడి. వీరేంద్ర చౌదరి, గొల్లపూడి జగదీశ్, సి.ఆర్.ఓ. కాట్రగడ్డ మురళీ కృష్ణ, ప్రిన్సిపాల్స్ వై.వి.సురేష్, శ్రీనివాస్ సింగ్ మరియు వైస్ ప్రిన్సిపాల్ సౌజన్య అభినందలను తెలిపారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

 ఫలితాలను వెల్లడించిన త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్  ఫలితాలను వెల్లడించిన త్రివేణి కృష్ణవేణి విద్యాసంస్థల డైరెక్టర్ గొల్లపూడి జగదీష్
'పది'ఫలితాలలో త్రివేణి విజయభేరి 
సామ్రాజ్యవాద శక్తుల చేతిలో మగ్గుతున్న శ్రామికవర్గాన్ని రక్షించేది 'ఎర్ర జెండానే'
పని గంటలను పెంచనివ్వం: - సీఐటీయూ
శివాలయం పునర్ నిర్మాణానికి 75వేల విరాళం అందజేసిన బండ్ల రాజశేఖర్ రెడ్డి
జనగణనతో పాటు కులగణన చేస్తామని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అక్షయ తృతీయ నాడు ఒడిశా 51 లక్షల మంది రైతుల ఖాతాకు ₹1025 కోట్లు బదిలీ 
మారుమూల ఆదివాసి గ్రామాల్లో  మెరుగైన వైద్యం సౌకర్యవంతంగా చూడాలి.