ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తే జీవితంలో ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్
లోకల్ గైడ్ :
బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో పదవీ విరమణ పొందుతున్న షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, యువజన క్రీడల అధికారి హనుమంతరావు, యాలాల్ తహసిల్దార్ అంజయ్య లకు జిల్లా యంత్రాంగం తరఫున పదవీ విరమణ ఆత్మీయ సన్మానం చేశారు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.... ప్రజలకు సేవ చేసే అదృష్టం ప్రతి ఒక్కరికి రాదని, ఆ అదృష్టం ప్రభుత్వ ఉద్యోగులకు రావడం అదృష్టమన్నారు. ఉద్యోగ బాధ్యతలో భాగంగా మన సర్వీసులో నిబద్ధతతో పనిచేసి ఉన్నతాధికారుల మన్ననలు పొందడం పదవీ విరమణ సమయంలో ఎంతో తృప్తిని కలిగిస్తుందని కలెక్టర్ అన్నారు. జిల్లాలో మీరు అందించిన సేవలను పరిగణలోకి తీసుకొని అవసరమైన సమయంలో మీ సేవలను తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. పదవి విరమణ అనంతరం తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో గడపాలని అదేవిధంగా తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆసక్తి ఉన్న వ్యవసాయ, సామాజిక కార్యక్రమాలతో ముందుకు సాగాలని కలెక్టర్ తెలిపారు.పదవీ విరమణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్ష చౌదరి, డి ఆర్ డి ఓ శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఇడి బాబు మోజెస్, డిబిసిడబ్ల్యూఓ ఉపేందర్, డిఎండబ్ల్యూఓ కమలాకర్ రెడ్డి, డిపిఓ జయసుధ, డీఈఓ రేణుకా దేవి లతో పాటు వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొని వారిని శాలువా మెమెంటోలతో ఘనంగా సత్కరించారు.
Comment List