నీట్ (యూ జి) ప్రవేశ పరీక్ష జిల్లాలో ప్రశాంతం.

జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

నీట్ (యూ జి) ప్రవేశ పరీక్ష జిల్లాలో ప్రశాంతం.

నీట్ (యూజీ)- 2025 ప్రవేశ పరీక్ష నల్గొండ జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రాలను ఆమె జిల్లా ఎస్పీ శరత్చంద్ర ప్రవర్ తో  కలిసి తనిఖీ చేశారు. పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటుచేసిన నీట్ పరీక్ష కేంద్రానికి వెళ్లి అక్కడ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ,గైర్హాజరైన అభ్యర్థుల వివరాలు, ఏర్పాట్లు, పోలీస్ బందోబస్తు, తనిఖీలు,ఇతర ఏర్పాట్లను, సౌకర్యాలను ఆమె పరిశీలించడమే కాకుండా, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటిండెంట్, నీట్ నోడల్ అధికారి శ్రీనివాస్, ఇతర అధికారులతో అడిగి తెలుసుకున్నారు.కాగా నల్గొండ జిల్లాలో నీట్ పరీక్ష కోసం 7 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, 2087 మంది అభ్యర్థులను పరీక్ష రాసేందుకు కేటాయించడం జరిగింది. ఆదివారం నిర్వహించిన నీట్ పరీక్షకు 2006 మంది అభ్యర్థులు హాజరుకాగా, 81 మంది గైర్హాజరయ్యారు. 96.1% అభ్యర్థులు నీట్ పరీక్ష రాసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.కాగా నీట్ పరీక్ష రాసే అభ్యర్థులకు  జిల్లా యంత్రాంగం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రధాన గేట్ నుండి పరీక్షా కేంద్రం వరకు వాహన సదుపాయం ఏర్పాటు చేసింది. అంతేకాక ఇంద్రియ విద్యాలయాకి వెళ్లేందుకు కూడా వాహనాలు ఏర్పాటు చేసింది. జిల్లా కలెక్టర్ వెంట స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ రాజ్ కుమార్,అదనపు ఎస్ పి రమేష్, నల్గొండ ఆర్డిఓ వై .అశోక్ రెడ్డి,తహసీల్దార్ హరిబాబు, ఇతర అధికారులు ఉన్నారు.

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
వికారాబాద్ : లోకల్ గైడ్ : వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోపాల్ గారి ఆధ్వర్యంలో సబితా ఇంద్రారెడ్డి గారి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం...
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాత ఆక్రందన? 
ప్రమాదవశాత్తు గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధం
హుషారుగా స్టెప్పులేసిన సమంత..
నీట్ (యూ జి) ప్రవేశ పరీక్ష జిల్లాలో ప్రశాంతం.
నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి