హుషారుగా స్టెప్పులేసిన సమంత..

భావోద్వేగానికి లోనైన స్టార్ హీరోయిన్!

హుషారుగా స్టెప్పులేసిన సమంత..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం నటి మరియు నిర్మాతగా పరిశ్రమలో తనదైన ముద్ర వేయాలని ప్రయత్నిస్తోంది. నటి‌గా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న ఆమె, ఇప్పుడు నిర్మాతగా కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవల ఆమె శుభం అనే చిత్రంలో అతిథి పాత్ర పోషించడమే కాకుండా, ఈ సినిమాను తన హోమ్ బ్యానర్‌ ద్వారా నిర్మిస్తోంది. ‘సినిమా బండి’ ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, హారర్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మే 9న విడుదల కానుంది.తన ప్రొడక్షన్‌ హౌస్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో సమంత ప్ర‌మోష‌న్ల‌లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటోంది. ఈ క్రమంలో శుభం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం సాయంత్రం వైజాగ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సమంతతో పాటు చిత్ర బృందం హాజరై సందడి చేసింది.ఈ సందర్భంగా మాట్లాడిన సమంత – ‘‘వైజాగ్‌లో జరిపిన నా సినిమాల ఈవెంట్లు అన్నీ సూపర్‌హిట్ అయ్యాయి. శుభం కూడా అలాంటి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం ఉంది. మూవీ చూసాక ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో థియేటర్‌ నుంచి బయటకు వస్తారు. హారర్ కామెడీగా అనిపించినా, ఇది చాలా ప్రత్యేకమైన సినిమా’’ అని చెప్పింది. తాను నటించిన మజిలీ, ఓ బేబీ, రంగస్థలం వంటి సినిమాల ఈవెంట్లు కూడా ఇక్కడే జరిగిన సంగతి గుర్తు చేసింది. ‘‘వైజాగ్‌కు వస్తే సినిమాలు బ్లాక్‌బస్టర్ అవుతాయి’’ అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఈ వేడుకలో సమంతను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అభిమానులను అలరించేందుకు సమంత, *శుభం* సినిమాలోని పాటకు స్టేజ్‌పై హుషారుగా స్టెప్పులేసింది. ఆమెతో పాటు పాటలో నటించిన వారు కూడా స్టేజ్‌పై డ్యాన్స్ చేసి ప్రేక్షకులను మురిపించారు.ఈ సమయంలో సమంత కాస్త భావోద్వేగానికి లోనయ్యింది. తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయిన ఆమెను చూసి అభిమానులు కూడా కంటతడిపడ్డారు.శుభం సినిమాలో హర్షిత్ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి, శ్రీయ కొంతం, శ్రావణి లక్ష్మి తదితరులు నటిస్తున్నారు.

 

Tags:

About The Author

Post Comment

Comment List

Latest News

తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
వికారాబాద్ : లోకల్ గైడ్ : వికారాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గోపాల్ గారి ఆధ్వర్యంలో సబితా ఇంద్రారెడ్డి గారి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం...
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాత ఆక్రందన? 
ప్రమాదవశాత్తు గడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ దగ్ధం
హుషారుగా స్టెప్పులేసిన సమంత..
నీట్ (యూ జి) ప్రవేశ పరీక్ష జిల్లాలో ప్రశాంతం.
నిరుద్యోగ కళాకారులకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి