తెలంగాణకు మరో ఐదు రోజులు వర్షాలే!
తెలంగాణలో వచ్చే ఐదు రోజులు వర్షాలు కొనసాగనున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో పాటు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది.పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ వివరించింది.
ఏఏ జిల్లాల్లో ఎప్పుడు వర్షాలు?
సోమవారం
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని సూచించింది.
మంగళవారం
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
బుధవారం
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.