అంగవైకల్యం అనేది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం..

దివ్యాంగులు దేనిలో తీసుపోరని తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని వెల్లడి..

అంగవైకల్యం అనేది భగవంతుడు ఇచ్చిన ప్రసాదం..

దివ్యాంగుల కోసం స్నేహ సొసైటీ చేపట్టిన వికలాంగుల బడిబాట కార్యక్రమం మరువలేనిది...  అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్...

నిజామాబాద్  జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) అంగవైకల్యం అనేది కూడా భగవంతుడు ఇచ్చిన ప్రసాధమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు... దివ్యాంగులు దేనిలో తీసుపోరని తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని సూచించారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమం ఉన్నతి కోసం కృషి చేస్తున్నయని వారు తెలిపారు... దివ్యాంగుల కోసం స్నేహ సొసైటీ చేపట్టిన వికలాంగుల బడిబాట కార్యక్రమం మరువలేనిదని వారు అన్నారు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడీలో గల న్యూ అంబేద్కర్ భవన్ లో స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్  దివ్యాంగుల పాఠశాల ఆధ్వర్యంలో వికలాంగుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగవైకల్యం అనేది భగవంతునిచ్చిన ఒక ప్రసాదంగా స్వీకరించాలన్నారు.. అలాగే తల్లిదండ్రులు సైతం నిరుత్సాహపడకుండా పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు.. అంగవైకల్యం ఉన్నప్పటికీ ప్రపంచ స్థాయిలో సైతం దివ్యాంగులు రాణించి చరిత్రను సృష్టించారన్నారు.. దివ్యాంగుల ఉన్నతి కోసం మనిషికి కావాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్ తో పాటు అన్ని రంగాల్లో ముందస్తు అవకాశం కల్పిస్తున్నారన్నారు..  అవకాశాలను సద్వినియోగం చేసుకోని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.. అలాగే దివ్యాంగుల ఉన్నతి కోసం బడిబాట కార్యక్రమం ఏర్పాటు చేసి వారికి పెన్షన్లు అందే విధంగా స్నేహ సొసైటీ కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ జ్యోతి మరియు స్నేహ సొసైటీ సిబ్బందిని అభినందించారు.. అనంతరం శాలువలతో అర్బన్ ఎమ్మెల్యేలు ఘనంగా సన్మానించారు... ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మీనారాయణ ఐసిడిఏ సిడిపిఓ సౌందర్య, వైద్యులు, మరియు తాటి వీరేశం గుప్తా, బాబా గౌడ్, జీవన్ రావు తదితరులు పాల్గొన్నారు..

Tags:

About The Author

Advertisement

Latest News

*ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.. *ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు...
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యేను ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ...
ఈనాటి బాలలే రేపటి పౌరులు
అలరించిన చిరుతల   రామాయణం
పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్న టీఎస్ ఆర్టిసి
సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన
కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్  సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ