చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య కు ఆసుపత్రిలో డైట్ కాంట్రాక్ట్...జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
పెద్దపల్లి,- లోకల్ గైడ్
చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య కు ఆసుపత్రిలో డైట్ కాంట్రాక్ట్ కేటాయించామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య సభ్యులకు డైట్ కాంట్రాక్ట్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ , సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ , పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో రోగులకు అవసరమైన ఆహారం సరఫరా చేసేందుకు చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య కు డైట్ కాంట్రాక్టు ఇవ్వడం జరిగిందని, ఈ కాంట్రాక్ట్ 2 సంవత్సరాల పాటు ఉంటుందని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం రోగులకు అందించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.