అంతర్జాతీయ స్థాయిలో న్యాయ సేవలు అందించే సంస్థలు

అంతర్జాతీయ స్థాయిలో న్యాయ సేవలు అందించే సంస్థలు

 తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించడం రాష్ట్ర గౌరవాన్ని పెంచుతుంది. 

సోమిరెడ్డి లా గ్రూప్ సేవలు ప్రవాసులకే కాదు,

దేశీయ యువతకు కూడా అవకాశాల గేట్వేగా మారనున్నాయి.-

రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 

హైదరాబాద్. లోకల్ గైడ్:

హైదరాబాద్‌ కోకాపేట్లో అమెరికన్ లా ఆఫీస్ అడుగుపెట్టింది! – న్యాయం అనేది దేశాలు, సరిహద్దులను మించిన సేవ అని మరోసారి నిరూపిస్తూ, అమెరికాలో స్థాపితమై విశ్వవ్యాప్తంగా విశ్వసనీయతను సంపాదించుకున్న సోమిరెడ్డి లా గ్రూప్ (Somireddy Law Group) ఇప్పుడు భారత్‌లో అడుగుపెడుతోంది. 
ఐదు ఖండాల్లో ప్రావీణ్యం కలిగిన ఈ అమెరికన్ లా ఆఫీస్, హైదరాబాద్‌ కోకాపేట్‌ వంటి ప్రీమియం లొకేషన్‌లో తమ నూతన కార్యాలయాన్ని ప్రారంభించడంతో న్యాయ సేవలకు కొత్త దారులు తెరుచుకుంటున్నాయి.

ఇమ్మిగ్రేషన్, వీసాలు, కార్పొరేట్ లీగల్ సపోర్ట్ – ఇక హైదరాబాద్ నుంచే!
ఇప్పుడు వరల్డ్-క్లాస్ లీగల్ సలహాలు అమెరికా వెళ్లకుండానే అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రవాస భారతీయుల వీసా సమస్యలపై, అమెరికాలో వ్యాపారం చేయదలచిన సంస్థలకు లీగల్ గైడెన్స్, లిటిగేషన్ సేవలు, విద్యార్థులకు యూఎస్ శిక్షణ అవకాశాలు – ఇవన్నీ హైదరాబాద్ నుంచే నిర్వహించేందుకు సోమిరెడ్డి లా గ్రూప్ సిద్ధమవుతోంది.

తెలంగాణ ప్రభుత్వ గ్లోబల్ విజన్‌కు తోడుగా సోమిరెడ్డి లా గ్రూప్
తెలంగాణ ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా, అమెరికన్ లా ఆఫీసుల స్థాపనకు ప్రోత్సాహం ఇస్తోంది. 

*ఈ నేపథ్యంలో, సోమిరెడ్డి లా గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు CEO సోమిరెడ్డి సంతోష్ రెడ్డి రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని కలిసి తమ కార్యాలయ ప్రారంభానికి రావాల్సిందిగా కోరారు.

అమెరికాలో ముద్ర వేసిన లా గ్రూప్, ఇప్పుడు ఇండియాలో
వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, విర్జీనియా, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, కాలిఫోర్నియా – ఇలా అమెరికాలో పలు రాష్ట్రాల్లో తన సేవలను విజయవంతంగా అందిస్తున్న సోమిరెడ్డి లా గ్రూప్, ఇప్పుడు అదే స్థాయిలో భారతీయులకు నేరుగా సేవలు అందించబోతోంది.

SRL ప్రొఫెషనల్ సర్వీసెస్ అనే అనుబంధ సంస్థ ద్వారా ఇప్పటివరకు వందలాది ఉద్యోగ అవకాశాలు కల్పించి, టెక్నాలజీ, లీగల్ సర్వీసుల రంగాల్లో ఒక నూతన అవకాశాలను నిర్మించింది. తెలుగు విద్యార్థులకు యూఎస్ శిక్షణ, వీసా సహాయం, కార్పొరేట్ లీగల్ అడ్వైజరీ లాంటి సేవలు SRL ద్వారా మరింత విస్తరించబోతున్నాయి.

ప్రవాసుల పక్కన నిలిచే సంస్థగా SRL
సోమిరెడ్డి లా గ్రూప్ తన ప్రో బోనో సేవలతో ఇప్పటికే అనేక తెలుగువారికి, విద్యార్థులకు, కుటుంబాలకు అమెరికాలో సహాయం చేసింది. ఇప్పుడు ఆ సేవలు స్వదేశంలోనూ అందుబాటులోకి రావడం వల్ల, ప్రపంచ తెలుగు సమాజానికి న్యాయ పరంగా ఇది పెద్ద ఆశ్రయంగా నిలవనుంది.

"అంతర్జాతీయ స్థాయిలో న్యాయ సేవలు అందించే సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించడం రాష్ట్ర గౌరవాన్ని పెంచుతుంది. సోమిరెడ్డి లా గ్రూప్ సేవలు ప్రవాసులకే కాదు, దేశీయ యువతకు కూడా అవకాశాల గేట్వేగా మారనున్నాయి. 
సరిహద్దులను దాటి..న్యాయాన్ని ఇప్పుడు సులభతరం చేసే ప్రయత్నానికి వారికి అభినందనలు తెలియజేస్తున్నాము." అని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి.. పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలి..
మంచిర్యాల (లోకల్ గైడ్): బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇంజనీరింగ్ కళాశాలగా అప్ గ్రేడ్ చేయాలని ఎంసిపిఐయు జిల్లా కార్యదర్శి సభని రాజేంద్రప్రసాద్ సహాయ కార్యదర్శి పసులేటి...
భూ సమస్యల పరిష్కారానికే భూభారతి రెవెన్యూ సదస్సులు
తెలంగాణలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
వన్డే బ్యాటింగ్ ర్యాంకుల్లో స్మృతి మంధాన అగ్రస్థానం
పాయాను త‌ర‌చూ తింటే క‌లిగే లాభాలు .......
ఇంటర్నేషనల్ యోగ డే 2025 జూన్, 21 న పతంజలి ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం
సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలి