సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ, శాంతి టాకీస్ '3 BHK' నుంచి సెకండ్ సింగిల్ ఆగిపోను నేను సాంగ్ రిలీజ్

సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ, శాంతి టాకీస్ '3 BHK' నుంచి సెకండ్ సింగిల్ ఆగిపోను నేను సాంగ్ రిలీజ్

సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ '3 BHK'.  బ్లాక్ బస్టర్ హిట్ 'మావీరన్' నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళ్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ వచ్చింది.ఫస్ట్ సింగిల్ కలలన్నీ సాంగ్  చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. తాజాగా సెకండ్ సింగిల్ ఆగిపోను నేను రిలీజ్ చేశారు.అమృత్ రామ్‌నాథ్  సాంగ్ ని ఎనర్జీటిక్ గా కంపోజ్ చేశారు. దేవ సాహిత్యం అందించడంతో పాటు సాంగ్ ని అద్భుతంగా పాడారు. మూవీ థీంని ప్రజెంట్ చేసిన ఈ సాంగ్ లో సిద్ధార్థ్ డిఫరెంట్ లుక్స్ అదిరిపోయాయి.ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఈసినిమా రూపొందుతోంది.ఈ చిత్రానికి అమృత్ రామ్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. దినేష్ కృష్ణన్ బి & జితిన్ స్టానిస్లాస్ డీవోపీగా పని చేస్తున్నారు. గణేష్ శివ ఎడిటర్. రాకేందు మౌళి డైలాగ్ రైటర్.ఈ  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జూలై 4న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

Tags:

About The Author

Latest News

IPL 2026లో ఆడతానో లేదో డిసెంబర్‌లో చెబుతా – ధోనీ IPL 2026లో ఆడతానో లేదో డిసెంబర్‌లో చెబుతా – ధోనీ
లోకల్ గైడ్ : మహేంద్ర సింగ్ ధోనీ, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరైన ఆయన, అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లోనే వీడ్కోలు పలికినా, ఇండియన్...
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది – సర్వదర్శనానికి 8 గంటల సమయం మాత్రమే
సినీ హీరో రానా దగ్గుబాటి బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఈరోజు అమలులో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో ఓటరు మోసాలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు – ఐదు ప్రధాన రకాల మోసాల జాబితా
భూమి లోతుల్లో పుట్టిన వజ్రాల కథ – ఆభరణాలకే కాదు, పరిశ్రమలకు కూడా ఆభరణం
హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలపై సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ
వంగవీడులో 630 కోట్ల జవహర్ ఎత్తిపోతల పథక శంకుస్థాపన – మంత్రి కోమటి రెడ్డి