ఫ్యామిలీతో మాల్దీవ్స్ లో సరదా.. కాజల్ చందమామకు హిట్ కోసం ఎదురుచూపు!

ఫ్యామిలీతో మాల్దీవ్స్ లో సరదా.. కాజల్ చందమామకు హిట్ కోసం ఎదురుచూపు!

టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవలే తన 40వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కాజల్, కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే తన ప్రియుడు గౌతమ్ కిచ్లూతో వివాహ బంధంలోకి అడుగుపెట్టి, కొద్ది కాలానికి తల్లి అయ్యింది.బాబు పుట్టిన తర్వాత కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చిన కాజల్, మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు తిరిగి సినిమాల్లో నటిస్తోంది. అయితే రీ ఎంట్రీ తర్వాత ఆశించిన హిట్‌లు, స్టార్‌డమ్ మాత్రం ఆమెను వెంటాడడం లేదు.తాజాగా సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన సికందర్ సినిమాలో కాజల్ ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చిన్నదైనా, తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ సికందర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడంతో, అది కూడా కాజల్‌కు పెద్దగా కలిసిరాలేదు.

ప్రస్తుతం కుటుంబంతో మాల్దీవ్స్‌లో హాలీడే ఎంజాయ్ చేస్తూ అందమైన ఫొటోలు షేర్ చేస్తూ కాజల్ మరోసారి ఫ్యాన్స్‌కి ఫుల్ ఫీస్ట్ ఇస్తోంది. అయితే ఇప్పుడు ఈ చందమామకు సరైన హిట్ ఎప్పుడు వస్తుందో చూడాలి!

Tags:

About The Author

Advertisement

Latest News

మాలిక సదుపాయాల్లో నిర్లక్ష్యంగా వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు... మాలిక సదుపాయాల్లో నిర్లక్ష్యంగా వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు...
సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావు... 
సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ, శాంతి టాకీస్ '3 BHK' నుంచి సెకండ్ సింగిల్ ఆగిపోను నేను సాంగ్ రిలీజ్
పరమపద సోపానం' పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి 
విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ నుంచి ‘సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
హెడింగ్లే టెస్టులో భారత్‌ దూకుడు..
తెలంగాణకు మరో ఐదు రోజులు వర్షాలే!
ఒలంపిక్ డే రన్ ప్రారంభించిన భువనగిరి అదనపు కలెక్టర్