మాలిక సదుపాయాల్లో నిర్లక్ష్యంగా వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు...

మాలిక సదుపాయాల్లో నిర్లక్ష్యంగా వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు...

సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావు... 

*నిజామాబాద్ జిల్లా ప్రతినిధి :(లోకల్ గైడ్) విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులను త్వరితగతిన పూర్తిచేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి,మరియు సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ్ భాస్కరరావు సంబంధిత అధికారులకు సూచించారు... నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 13వ డివిజన్ సారంగాపూర్ లో గల జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ తో ఆకస్మిక తనిఖీ చేశారు.. ఈ తనిఖీల్లో భాగంగా విద్యార్థులకు అందించే విద్యాలయంలో మరుగుదొడ్లు మరియు ఇతర వసతుల రూపకల్పనపై మరియు ఇతర వసతులపై ఇన్చార్జి ప్రిన్సిపాల్ గా విధులు నిర్వర్తిస్తున్న సత్యనారాయణ ను అడిగి తెలుసుకున్నారు.. అలాగే పాఠశాలలో కనీస వసతులైన మరుగుదొడ్లు ఎందుకు లేవని మరియు ఇతర వసతులపై ఆరా తీశారు... మరుగుదొడ్ల నిర్మాణం పై మరియు ఇతర నిర్మాణాలపై సంబంధిత కాంట్రాక్టర్ సుదర్శన్ ను మరియు పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. బిల్లులు పెండింగ్ పనుల పెండింగ్ పై ఇతర విషయాలపై ఆరా తీశారు.. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కచ్చితంగా పాటించాలని అందుకు అనుగుణంగా త్వరితగతిన ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి ఒక్కటి పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ కుమార్ తో పాటు సంబంధిత పాఠశాల అధికారులకు సూచించారు.. అయితే అందుకు సంబంధించిన కాంట్రాక్టర్ మరియు అధికారులు 15 రోజుల వరకు పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు. అలాగే ముఖ్యంగా పాఠశాలకు అతి దగ్గరలో ఉన్న కల్లు కాంపౌండ్ విషయం పట్ల కూడా ఎక్సైజ్ శాఖ అధికారులతో చర్చించారు.. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పాఠశాలకు దూరంగా ఉంచాలని సూచించారు.. ఈ సందర్శనలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ్ భాస్కర్ రావు మరియు జిల్లా కోర్ట్ సూపరిండెంట్ మరియు సిబ్బంది పాల్గొన్నారు...

Tags:

About The Author

Related Posts

Advertisement

Latest News

మాలిక సదుపాయాల్లో నిర్లక్ష్యంగా వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు... మాలిక సదుపాయాల్లో నిర్లక్ష్యంగా వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు...
సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావు... 
సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ, శాంతి టాకీస్ '3 BHK' నుంచి సెకండ్ సింగిల్ ఆగిపోను నేను సాంగ్ రిలీజ్
పరమపద సోపానం' పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి 
విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ నుంచి ‘సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
హెడింగ్లే టెస్టులో భారత్‌ దూకుడు..
తెలంగాణకు మరో ఐదు రోజులు వర్షాలే!
ఒలంపిక్ డే రన్ ప్రారంభించిన భువనగిరి అదనపు కలెక్టర్