మాస్ మహారాజ రవితేజ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ జులై 11న రీ రిలీజ్  !!!

మాస్ మహారాజ రవితేజ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ జులై 11న రీ రిలీజ్  !!!

మాస్ మహారాజ రవితేజ మళ్లీ తన అభిమానులకు ఫుల్టూ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీని అందించేందుకు రెడీ అయ్యాడు. రవితేజ నటించిన ‘మిరపకాయ్’ మూవీ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించగా, ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.ఇప్పుడు ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. జులై 11న ‘మిరపకాయ్’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. హనుమాన్ మీడియా ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు, ఈ సినిమాలో అందాల భామ రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేత్ హీరోయిన్లుగా నటించగా, రమేష్ పుప్పల ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు. ‘మిరపకాయ్’ మూవీ రీ-రిలీజ్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఇటీవల రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ చిత్రం విడుదలై మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది, అదే తరహాలో మిరపకాయ్ సందడి చేయబోతోంది.

Tags:

About The Author

Advertisement

Latest News

సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా... సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
  ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది... జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి... నిజామాబాద్,(లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...
రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం 
సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ...