ఫ్యామిలితో దిల్ రాజు........

ఫ్యామిలితో దిల్ రాజు........

తాజాగా దిల్ రాజు మరోసారి తన కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతూ ఫోటోలు షేర్ చేశారు. భార్యతో పాటు పిల్లలతో ఉన్న ఫోటోల్లో కూడా ఆయన ఉల్లాసంగా కనిపించారు. టాలీవుడ్‌లో టాప్ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు, ఒకప్పుడు డిస్ట్రిబ్యూటర్‌గా ప్రారంభించి ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దిల్ రాజు సినిమాకు మినిమం గ్యారెంటీ అనే ముద్ర ఉంది. స్టార్ హీరోలు, ప్రఖ్యాత దర్శకులు కూడా ఆయన బ్యానర్‌లో సినిమా చేయాలని కోరుకుంటారు.మొదట్లో వ్యక్తిగత జీవితాన్ని ఎక్కువగా బయటపెట్టని దిల్ రాజు, ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫొటోలతో అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇటీవల ఆయన కూతురు, మనవడితో ఫోటోలు వైరల్ అవ్వగా, ఇప్పుడు భార్య, కొడుకు, మనవడితో కలిసి ఉన్న తాజా ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు దిల్ రాజు రోజురోజుకు యంగ్‌గా కనిపిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఆయన ఈ మధ్య సినిమాలకంటే ఫ్యామిలీకి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని పేర్కొంటున్నారు. ఇన్నాళ్లు కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్న దిల్ రాజు ఇప్పుడు కుటుంబంతో సంతోషంగా గడుపుతూ తన వారసులను సినిమాల నిర్మాణ బాధ్యతల్లోకి నెమ్మదిగా తీసుకొస్తున్నారని అంటున్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా... సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
  ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది... జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి... నిజామాబాద్,(లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...
రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం 
సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ...