యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం
ప్రతి ఒక్కరూ యోగా అలవాటుచేసుకోవాలి
By Ram Reddy
On

__స్థానిక శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి.*
హనుమకొండ(లోకల్ గైడ్):
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వేయి స్తంభాల ఆలయంలో ఏర్పాటు చేసిన యోగా డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య.యోగ భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి ఒక గొప్ప వరమని వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య అన్నారు. వేయి స్తంభాల ఆలయంలో ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యోగ డే లో స్థానిక శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి తో కలిసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. యోగ డే సందర్భంగా నిర్వహించిన యోగ అభ్యాసన కార్యక్రమంలో భాగంగా ఎంపీ డా.కడియం కావ్య యోగ సాధన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ... యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని అన్నారు. యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు. యోగా ద్వారా శరీరంలోని ప్రతి అవయవానికి ప్రయోజనం కలుగుతుందన్నారు. ఐక్యరాజ్యసమితిలో 177 దేశాల మద్దతు నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్నామని తెలియజేశారు. మారుతున్న జీవన విధానంలో ప్రతి ఒక్కరూ యోగా, ధాన్యం అలవాటు చేసుకోవాలని తెలిపారు. ఆయుష్ డిపార్ట్మెంట్ వారు పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం కోసం యోగాను ప్రోత్సహించాలన్నారు. కొన్ని యోగా సెంటర్లను ఏర్పాటు చేయాలని సూచించారు.అనంతరం రుద్రేశ్వరుడిని దర్శించుకున్న ఎంపీ హనుమకొండలోని రుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయాన్ని వరంగల్ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ కడియం కావ్య సందర్శించారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజలు అనంతరం ఎంపీ డా.కడియం కావ్య కు అర్చకులు తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు, మహాదాశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ అప్పయ్య, ఆయుష్ డిపార్ట్మెంట్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.Tags:
About The Author

Latest News

16 Aug 2025 09:49:06
https://youtu.be/-q66o0X_PAw?si=cTCR02yZyVGpw_vGhttps://youtu.be/-q66o0X_PAw?si=cTCR02yZyVGpw_vG