ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 

ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 

శరీరం, మనస్సు కి శక్తినిచ్చేదే యోగ 

 మనస్సును నిశ్శబ్దం చేసే అభ్యాసమే యోగ 

 ప్రతీ ఆసనం ఆరోగ్యాన్ని ఇస్తుంది 

 జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ 

జనగామ (లోకల్ గైడ్):-

 అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక  ధర్మకంచ స్టేడియంలో  ఏర్పాటు చేసిన  కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ చేతన్ తో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ... ఆరోగ్యమే మహాభాగ్యం అని... ఇందుకోసం యోగ ఎంతగానో దోహదపడుతుందన్నారు.జిల్లా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని.. యోగ ను ప్రతీ ఒక్కరు అలవాటు చేసుకోవాలన్నారు. 
ఈ కార్యక్రమాన్ని  జిల్లా స్థాయిలోనే కాక మండల స్థాయిలో వివిధ ప్రదేశాల్లో పాఠశాలలో, కార్యాలయల్లో కూడా నిర్వహించామన్నారు.
నిత్యజీవితంలో ప్రతీ ఒక్కరు విధిగా యోగ ను అలవాటు చేసుకోవాలని.. దానివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు రావన్నారు.
యోగ శారీరక, మానసిక  ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుందని. యోగ ఆసనాలు చేయడం వల్ల ఒత్తిడి తగ్గి..ఏకాగ్రత, రోగనిరోధక శక్తి కూడా పెంచుతుందన్నారు.అనేక శారీరక,ఆరోగ్య ప్రయోజనాలను అందించే యోగ అందరి జీవితం లో ఒక భాగం కావాలన్నారు. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా  సాధించవచ్చని. వయస్సు తో సంబంధం లేకుండ ప్రతీ ఒక్కరు.. యోగ కోసం రోజులో కొంత సమయం కేటాయించాలిసిన అవసరం తప్పకుండ ఉందన్నారు. ఈ కార్యక్రమం లో వివిధ శాఖలకు చెందిన అధికారులు, విద్యార్థులు, యువత, ప్రజలు పాల్గొన్నారు

Tags:

About The Author

Advertisement

Latest News

సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా... సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
  ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది... జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి... నిజామాబాద్,(లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...
రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం 
సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ...