హృతిక్ – ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే మాటలకేం తక్కువ కాదు.. ‘వార్ 2’ గురించి అయాన్ ముఖర్జీ మాట!
భారతీయ సినీ పరిశ్రమలో పెద్ద స్టార్ హీరోలు ఇద్దరితో కలసి సినిమాను తెరకెక్కించడం సులభం కాదు. తాజాగా ‘వార్ 2’కు దర్శకత్వం వహిస్తున్న అయాన్ ముఖర్జీ ఈ విషయం తన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
‘‘వార్ 2’లో హృతిక్, ఎన్టీఆర్ మధ్య ఎపిక్ కాంబినేషన్ చూడబోతున్న అభిమానులకు అద్భుతమైన అనుభవం ఇవ్వాలంటే ప్రతి సన్నివేశాన్ని రెండు వైపులా బలంగా రూపొందించాలి’’ అని అయాన్ చెప్పారు. ఇద్దరి అభిమానులూ తృప్తి పడేలా కథలో ఘర్షణ, యాక్షన్ సీన్లు సజావుగా ఉండేలా పనిచేయాల్సి వచ్చింది. ఒక్కరినైనా తక్కువ చూపించినట్టు అనిపిస్తే అంతా వేస్ట్ అవుతుందనేది అయాన్ మాట.
హృతిక్ – ఎన్టీఆర్ మధ్య యాక్షన్ ఘర్షణను ఎలివేట్ చేయడం పెద్ద సవాలే. ‘‘వార్ ఫ్రాంచైజీని ముందుకు తీసుకెళ్తూ.. అదే సమయంలో నాకంటూ ప్రత్యేక ముద్ర వేసేలా చేయాలి. మొదటి పార్ట్‌లో వర్క్యైన అంశాలను గౌరవిస్తూ, కొత్త స్థాయికి అనుభవాన్ని తీసుకెళ్లాలన్నది నా ప్రయత్నం’’ అని అయాన్ చెప్పారు.
ఫ్యాన్స్‌ను సంతృప్తి పరచడమే లక్ష్యం:
‘‘ఎన్టీఆర్ ఫ్యాన్స్, హృతిక్ ఫ్యాన్స్ అందరూ ఉత్సాహపడేలా యాక్షన్ సీన్స్‌ను తీర్చిదిద్దడానికి చాలా సమయం పెట్టాను. వారిద్దరూ ఎదురుపడే ఘర్షణ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండేలా ఉండాలి’’ అని అయాన్ వివరించారు.
‘వార్’లో హృతిక్ – టైగర్ ష్రాఫ్ మధ్య ఉన్న యాక్షన్‌ను మించి చూపించడం మరో ప్రధాన సవాల్. ఇకపై హృతిక్‌కి ‘‘ధూమ్’’, ‘‘క్రిష్’’ వంటి సిరీస్‌లతో ఉన్న యాక్షన్ రేంజ్‌ను దాటేలా ‘వార్ 2’లో కొత్త సీక్వెన్స్‌లను రూపొందించకపోతే డైరెక్టర్‌గా తన పని విఫలమవుతుంది అని అయాన్‌కు తెలుసు.
టీజర్‌పై విమర్శలు – ట్రైలర్‌తో సవరణే లక్ష్యం:
తాజాగా విడుదలైన టీజర్లో కొన్ని యాక్షన్ సీన్స్ గ్రాఫిక్స్ తక్కువ స్థాయిలో ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. దాంతో ఫైనల్ ఔట్‌పుట్‌లో వాటిని తీర్చిదిద్దే పని అయాన్ ముందే చేయాలి. ట్రైలర్‌తో ప్రేక్షకులను మరోసారి కట్టిపడేయాలి.
‘‘హృతిక్ – ఎన్టీఆర్ కాంబినేషన్ స్పెషల్‌గానే ఉంటుంది. అభిమానులు ఎప్పటికీ మరిచిపోలేని అనుభవాన్ని అందిస్తానని వాగ్దానం చేస్తున్నా. అది మాటలకే పరిమితం కాకుండా, థియేటర్లలో నిజం చేసి చూపిస్తాను’’ అని అయాన్ ముఖర్జీ కాన్ఫిడెంట్‌గా చెప్పాడు.
ఇప్పుడు ఈ మాటలు తెరపై నిజం అవుతాయో లేదో.. చూడాలి మరి!