డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
గద్వాల, లోకల్ గైడ్:
మల్డకల్ మండలం పరిధిలోని పాల్వాయి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి గ్రామ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. నేటి యువత అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, జిల్లా సీనియర్ నేత గడ్డం కృష్ణారెడ్డి, పీ ఏ సీ ఎస్ ఛైర్మన్ తిమ్మారెడ్డి, మాజీ ఎంపీపీ రాజారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ వీరన్న, మాజీ సర్పంచ్ శివరాం రెడ్డి నాయకులు సీతారాం రెడ్డి, అజయ్, వెంకటన్న, కురుమన్న, జీవన్ రెడ్డి, ఎల్లప్ప, రంజిత్ ,మహేష్ వీరేష్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.