రేషన్‌ పంపిణీ 100% సజావుగా జరగాలి,

రేషన్‌ పంపిణీ 100% సజావుగా జరగాలి,

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్,

రేషన్ డీలర్లు నిబంధనలు పాటించాలి,
ప్రతి లబ్ధిదారునికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ,
30వ తేదీ వరకు రేషన్ పంపిణీ కొనసాగుతుంది.
జిల్లాలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ పురోగతి,

లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
రేషన సన్న బియ్యం పంపిణీ సజావుగా 100% నిర్వహించాలని, ఎక్కడా అక్రమాలకు తావులేకుండా చూడాలని నాగర్ కర్నూల్ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు.
శుక్రవారం నాగర్ కర్నూల్ నియోజకవర్గం పరిధిలోని బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామంలో 16వ నెంబర్ రేషన్‌ షాపును జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సందర్శించారు.గ్రామంలో 2 రేషన్ దుకాణాలు ఉన్నాయని,16వ నెంబర్ రేషన్ దుకాణం లో 504 కార్డులు, 38వ రేషన్ దుకాణంలో 499 రేషన్ కార్డులు ఉన్నాయని అధికారులు కలెక్టర్ కు తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ.......   ప్రతి రేషన్ డీలర్ ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటిస్తూ పంపిణీ సజావుగా జరగాలని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు 100% సన్న బియ్యం అందించాల్సిన అవసరం ఉందని స్పష్టంగా చెప్పారు. ఎక్కడైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులకు తెలియజేయాలని సూచించారు. వర్షాకాలం నేపథ్యంలో, రవాణా మరియు ఇతర ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం జూన్‌లోనే మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లాలో ఇప్పటికే 65.69% పంపిణీ పూర్తయిందని కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు 1,60,351 మంది లబ్ధిదారులు మూడు నెలల సన్న బియ్యం అందుకున్నారని చెప్పారు. జిల్లాలో ఉన్న మొత్తం 2,43,720 రేషన్ కార్డులకు గాను జూన్, జూలై, ఆగస్టు నెలలకు బియ్యం పంపిణీ జరుగుతోంది. ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున మొత్తం 14169.405 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.సాధారణంగా ప్రతి నెల 15వ తేదీ వరకు మాత్రమే పంపిణీ జరిగే విధానాన్ని మార్చి, ఈ నెల 30వ తేదీ వరకు పంపిణీ కొనసాగించాలనే ఆదేశాలు జిల్లా వ్యాప్తంగా ఉన్న రేషన్ డీలర్లకు ఇచ్చినట్లు చెప్పారు. ఇంకా బియ్యం అందుకోని లబ్ధిదారులు ఈ నెలాఖరు వరకు బియ్యం తీసుకోవచ్చని తెలిపారు. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.కలెక్టర్ వెంట బిసినపల్లి తహసిల్దార్ మున్నూరోద్దీన్ ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News