వర్షాల కోసం ఆశగా అన్నదాతల ఎదురుచూపు 

వర్షాల కోసం ఆశగా అన్నదాతల ఎదురుచూపు 

మహబూబాబాద్ (లోకల్ గైడ్){రుతుపవనాల ప్రభావం తో  కురిసిన కొద్ది పాటి వర్షాలకి రైతులు  తొందరగా దుక్కులు దున్ని విత్తనాలు వేసిన రైతుకు ఆతరువాత వర్షాలు లేక  వేసిన విత్తనాలు మొలకెత్తక  రైతులు ఆశగా మబ్బుల వైపు చూస్తున్నారు.  
 సాధారణంగా రోహిణి కార్తే లో రోళ్ళు పగిలి పోయె  ఎండలు కొడతాయి, కానీ ఈసంవత్సరం అలా కాకుండా ఎండల తీవ్రత తక్కువగా ఉంది దానితో పాటు కురిసిన కొద్ది పాటి వర్షాలకు  రైతులు ఆశగా ఈసారి ముందుగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని తొందరగా వారి పంట చెనులను , చేలకలను దుక్కులు దున్ని చదును చేసి ఉంచుకున్నారు ,ఆతరువాత అధను చూసి పత్తి గింజలను,మొక్క జొన్న కూడా ఆశగా విత్తుకున్నారు,ఆతరువాత రైతులకు అసలు కష్టాలు మొదలైనాయి రుతుపవనాలు కదలిక లేకపోవడం మరియు వర్షాలు కురువకపోవడం వల్ల వేసిన పంటలు కూడా ఎండి పోయి కొద్ది మంది రైతులు పత్తి నీ చెడగొట్టి పెసర్లు వంటి పంటలను వేయడం తో పాటు మరికొద్ది మంది ఆశగా మళ్ళీ పత్తి గింజలను వేశారు అప్పటికి వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు ఆశగా మబ్బుల వైపు చూస్తున్నారు.ఒకవైపు మాత్రం భావి పారకం తో కొంత మంది రైతులు పంటలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఇలానే వర్షాలు లేక పోతే తమ పరిస్థితి ఏంటని ,అన్నదాతలు తమ పంటలు ఎండి పోవలసినదేన అని తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.ఇకనైనా వరుణ దేవుడు కరుణించి వర్షాలు కురవాలని అన్నదాతలు కోరుకుంటున్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

మాలిక సదుపాయాల్లో నిర్లక్ష్యంగా వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు... మాలిక సదుపాయాల్లో నిర్లక్ష్యంగా వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు...
సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావు... 
సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ, శాంతి టాకీస్ '3 BHK' నుంచి సెకండ్ సింగిల్ ఆగిపోను నేను సాంగ్ రిలీజ్
పరమపద సోపానం' పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి 
విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ నుంచి ‘సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
హెడింగ్లే టెస్టులో భారత్‌ దూకుడు..
తెలంగాణకు మరో ఐదు రోజులు వర్షాలే!
ఒలంపిక్ డే రన్ ప్రారంభించిన భువనగిరి అదనపు కలెక్టర్