బరోసా కేంద్రం అండగా నిలవడం అభినందనీయం 

బరోసా కేంద్రం అండగా నిలవడం అభినందనీయం 

- జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు.

గద్వాల, లోకల్ గైడ్ :
 లైంగిక వేధింపులకు గురైన మహిళలకు ఒకే గొడుగు క్రింద వైద్య, న్యాయ, కౌన్సిలింగ్, సైకలాజికల్ సపోర్ట్ అందిస్తూ బరోసా కేంద్రం అండగా నిలవడం అభినందనీయం అని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాస రావు అన్నారు. భరోసా కేంద్రం 3వ వార్షికోత్సవాన్ని జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో బరోసా సిబ్బంది బాధిత మహిళతో ఘనంగా జరుపుకున్నారు. అందులో భాగంగా భరోసా డబ్ల్యూఎస్ఐ స్వాతి భరోసా కేంద్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు,  బాధితులకు అందిస్తున్న  కౌన్సెలింగ్, వైద్య, విద్య, న్యాయ సహాయాలతో పాటు 
కొంత మంది బాధితులకు అందిస్తున్న తక్షణ ఆర్థిక సహాయం వివరాలు జిల్లా ఎస్పీ కి వివరించారు. భరోసా కేంద్రానికి వచ్చిన బాధితుల్లో కొంతమంది పదవ తరగతి విద్యార్థులను ప్రశంసిస్తూ బహుమతులను ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ లైంగిక వేధింపులకు గురైన బాధితులకు స్టేట్మెంట్ రికార్డు పకడ్బందీగా నిర్వహించడం తో పాటు మెరుగైన వైద్య, న్యాయ, కౌన్సిలింగ్ సేవలు  అందించాలని అన్నారు . అలాగే బాధిత మహిళలు ఎలాంటి చులకన బావానికి గురికాకుండా కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు భవిష్యత్ లో వారి కాళ్ళ మీద వారు ఆర్థికంగా నిలబడేలా బరోసా కల్పించాలని బరోసా సిబ్బంది కి సూచనలు, సలహాలు ఇవ్వాలనీ, భరోసా కేంద్రానికి వచ్చిన బాధితులకు అండగా నిలబడుతూ, 24 గంటలు భరోసా అందుబాటులో ఉంటూ, నిబద్ధతతో  సేవలు అందించాలని అన్నారు. ఇప్పటి వరకు బరోసా సిబ్బంది అందిస్తున్న సేవల తీరుని ప్రశంసిస్తూ భరోసా సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో గద్వాల డీఎస్పీ మొగిలయ్య, భరోసా కోఆర్డినేటర్ శివాని, స్రవంతి, శ్వేత, శిరీష, కవిత, కీర్తి పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

మాలిక సదుపాయాల్లో నిర్లక్ష్యంగా వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు... మాలిక సదుపాయాల్లో నిర్లక్ష్యంగా వహిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదు...
సారంగాపూర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఉదయ భాస్కర్ రావు... 
సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ, శాంతి టాకీస్ '3 BHK' నుంచి సెకండ్ సింగిల్ ఆగిపోను నేను సాంగ్ రిలీజ్
పరమపద సోపానం' పూరి గారి స్టయిల్లో ఉంటుంది.. కచ్చితంగా మంచి విజయాన్ని అందుకుంటుంది : అర్జున్ అంబటి 
విజయ్ ఆంటోనీ ‘మార్గన్’ నుంచి ‘సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్
హెడింగ్లే టెస్టులో భారత్‌ దూకుడు..
తెలంగాణకు మరో ఐదు రోజులు వర్షాలే!
ఒలంపిక్ డే రన్ ప్రారంభించిన భువనగిరి అదనపు కలెక్టర్