ఒక చిన్న గొడవ… హీరో వరకు వెళ్లిన డ్రగ్స్ కేసు!

ఒక చిన్న గొడవ… హీరో వరకు వెళ్లిన డ్రగ్స్ కేసు!

చిన్న తేడా ఎంత దూరం తీసుకెళ్తుందో తమిళ సినీ పరిశ్రమకు ఇదే ఉదాహరణ. చెన్నైలోని ఒక బార్‌లో జరిగిన చిన్న గొడవ చివరకు డ్రగ్స్ కేసుగా మారి, నేరుగా హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) మెడకు ఉచ్చు బిగించింది.అన్నాడీఎంకే పార్టీకి చెందిన మాజీ కార్యనిర్వాహకుడు ప్రసాద్‌ను ఘర్షణ ఘటనలో పోలీసులు అరెస్టు చేయగా, ఆయనపై డ్రగ్స్ వినియోగం ఆరోపణలు వచ్చాయి. దీనిని ఆరా తీసిన పోలీసులు డ్రగ్స్ సరఫరా చైన్‌ను బయటకు తీస్తూ, ప్రసాద్‌ ద్వారా శ్రీరామ్‌కు డ్రగ్స్ వెళ్లినట్లు నిర్ధారించారు. ప్రసాద్ ఇచ్చిన వివరాల ఆధారంగా శ్రీరామ్ గతంలో 40 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేశాడని తేలింది.తదుపరి దర్యాప్తులో పక్కా ఆధారాలు సేకరించిన పోలీసులు శ్రీరామ్‌ను అదుపులోకి తీసుకొని, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వైద్య పరీక్షల తర్వాత ఆయనను నుంగంబాక్కం పోలీస్ స్టేషన్‌కు తరలించి, విచారణ జరిపారు. అనంతరం ఎగ్మోర్ కోర్టులో హాజరు పరిచి జూలై 7 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.ఇక ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు పోలీసు అధికారులు శ్రీరామ్ కస్టడీ కోసం కోర్టులో పిటిషన్ వేయనున్నారు. శ్రీరామ్‌ను విచారిస్తే మరికొందరు కోలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.ఈ అరెస్టు తమిళ సినీ పరిశ్రమను ఒక్కసారిగా కుదిపేసింది. సినీ ప్రముఖులు, అభిమానులు ఈ పరిణామంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు డ్రగ్స్ నెట్‌వర్క్‌కి సంబంధించి మరికొందరి పై దర్యాప్తు కొనసాగిస్తుండటంతో మరిన్ని వివరాలు త్వరలో వెలుగు చూడనున్నాయి.

Tags:

About The Author

Advertisement

Latest News