సౌరవ్ గంగూలీ బయోపిక్‌కి రాజ్‌కుమార్ రావు ఫిక్స్! – 2026లో తెరపైకి ‘దాదా’ జీవితం

సౌరవ్ గంగూలీ బయోపిక్‌కి రాజ్‌కుమార్ రావు ఫిక్స్! – 2026లో తెరపైకి ‘దాదా’ జీవితం

భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జీవితం ఆధారంగా రూపొందే బయోపిక్ ప్రాజెక్టు ఎట్టకేలకు వేగం పుంజుకుంటోంది. గత కొంతకాలంగా ఈ సినిమా గురించి అనేక చర్చలు జరుగుతూనే ఉన్నా, తాజాగా కీలక అప్‌డేట్ ఒకటి వెలుగులోకి వచ్చింది.గంగూలీ పాత్రను ఎవరు పోషిస్తారనే ఉత్కంఠకు తెరదించుతూ, బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు ఈ బైోపిక్‌లో గంగూలీ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో రణ్‌బీర్ కపూర్, ఆయుష్మాన్ ఖురానా వంటి పలువురు పేర్లు వినిపించినా, చివరకు ఈ ప్రతిష్ఠాత్మక పాత్రకు రాజ్‌కుమార్ రావునే ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.ఈ సందర్భంగా సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, “నా బయోపిక్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. 2026 జనవరిలో షూటింగ్ ప్రారంభం అవుతుంది. అదే ఏడాది డిసెంబర్‌లో సినిమా విడుదల కావచ్చని భావిస్తున్నాం. రాజ్‌కుమార్ రావు నా పాత్రను పోషిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సినిమాకు నా పూర్తి సహకారం అందిస్తాను,” అని చెప్పారు.రాజ్‌కుమార్ రావు కూడా ఈ పాత్రపై తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ –
“గంగూలీ బయోపిక్‌లో నటించడం ఎంతో గౌరవంగా ఉంది. ఇది ఒక పెద్ద బాధ్యత. కొంత ఆందోళనగా ఉన్నా, అదే సమయంలో ఎంతో ఆసక్తికరంగా కూడా ఉంటుంది. గంగూలీ గారు బెంగాలీ కావడంతో ఆ భాషను నేర్చుకుంటున్నాను. భార్య పత్రలేఖ సాయం తీసుకుంటున్నాను. ఇది నా నటనకు సహజత్వాన్ని ఇస్తుంది,” అని తెలిపారు.ఈ బయోపిక్‌ను విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహించనుండగా, లవ్ ఫిల్మ్స్ పతాకంపై నిర్మాణం జరగనుంది. సినిమాలో గంగూలీ బాల్యం నుంచి మొదలుకొని, క్రికెట్‌ రంగ ప్రవేశం, కెప్టెన్సీ బాధ్యతలు, వివాదాలు, వ్యక్తిగత జీవితం వంటి కీలక ఘట్టాలను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.గంగూలీ క్రికెట్ కెరీర్ గురించి చెప్పాలంటే –
భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడిన గంగూలీ, లెఫ్ట్‌హ్యాండెడ్ బ్యాటర్‌గా 18,575 అంతర్జాతీయ పరుగులు చేసి సుదీర్ఘ కెరీర్‌ను ఆసక్తికరంగా మలిచాడు. 2008లో రిటైర్మెంట్ తర్వాత బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా తన సేవలు అందించాడు.రాజ్‌కుమార్ రావు లాంటి ప్రతిభావంతుడైన నటుడు గంగూలీ పాత్రను పోషించబోతుండటంతో, ఈ బయోపిక్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tags:

About The Author

Latest News

ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్ విడుదల
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ద్విశతకంతో ఆకట్టుకున్న టీమ్ ఇండియా స్టార్ వికెట్‌ కీపర్‌ రిషభ్ పంత్, ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఏడో స్థానానికి...
ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0తో ఉద్యోగాల సృష్ఠి: మ‌ంత్రి లోకేశ్
స్వర్ణాంధ్ర విజన్–2047కు సంపూర్ణ మ‌ద్ద‌తు....
 గోదావ‌రి పుష్క‌రాల‌పై మంత్రి వ‌ర్గ ఉప‌సంఘం, ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు....
శ్రీ భద్ర కాళి దేవస్థానంలో 15 రోజుల పాటు జరిగే శాకంభరీ నవరాత్ర మహోత్సవములు
చేతి వృత్తి వస్తువుల ప్రదర్శన/అమ్మకాలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, మంత్రులు
అంతర్జాతీయ యాంటీ డ్రగ్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా మాదక ద్రవ్యాల నిర్మూలనపై విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం.