ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0తో ఉద్యోగాల సృష్ఠి: మంత్రి లోకేశ్
By Ram Reddy
On
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ ఉత్పత్తి, పరిశోధన, అభివృద్ధి హబ్‌గా మారుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.నూతనంగా ప్రవేశపెట్టిన ఏపీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుందని ఆయన తెలిపారు.ఈ పాలసీ ద్వారా యాంకర్ యూనిట్లు, ఎక్స్‌లెన్స్ సెంటర్లు, స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రాలు, సాంకేతిక బదిలీ వేదికలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.భారతదేశ ఆత్మనిర్భరతలో ఏపీ కీలక పాత్ర పోషించడంతో పాటు, కొత్తగా అభివృద్ధి చేయబోయే క్లస్టర్లలో వేలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ విధాన ఉద్దేశమని మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Tags:
About The Author
Latest News
25 Jun 2025 17:14:26
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ద్విశతకంతో ఆకట్టుకున్న టీమ్ ఇండియా స్టార్ వికెట్ కీపర్ రిషభ్ పంత్, ఐసీసీ టెస్ట్ బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అత్యుత్తమంగా ఏడో స్థానానికి...