"నేను రెడీ" బ్రిలియంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ - టైటిల్, గ్లింప్స్ లాంఛ్ ఈవెంట్ లో హీరో హవీష్

నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో హవీష్, సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా, మజాక వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు నక్కిన త్రినాథరావు కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ "నేను రెడీ". ఈ చిత్రాన్ని హార్నిక్స్ ఇండియా ఎల్ ఎల్ పి బ్యానర్ పై  నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది. డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న "నేను రెడీ" మూవీ టైటిల్, గ్లింప్స్ ను ఈ రోజు హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలోచైల్డ్ ఆర్టిస్ట్ రోహన్ రాయ్ మాట్లాడుతూ - ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న మా హీరో హవీష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మా డైరెక్టర్ త్రినాథరావు గారు, హవీష్ గారు సూపర్ హిట్ కొట్టేందుకు నేను రెడీ అంటున్నారు. ఇది స్టాటర్స్ మాత్రమే ఫుల్ మీల్స్ రెడీగా ఉంది. ఎంటైర్ మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్.  అన్నారు.నటుడు బలగం సత్యనారాయణ మాట్లాడుతూ - "నేను రెడీ" మూవీలో మంచి క్యారెక్టర్ చేశాను. ఈ చిత్రంలో మంచి ఫన్ ఉంటుంది. సినిమా ఆద్యంతం మీ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ త్రినాథరావు గారికి థ్యాంక్స్. అన్నారు.నటి జయవాణి మాట్లాడుతూ - "నేను రెడీ" సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేశాను. చాలా రోజుల తర్వాత నాకు ఇలాంటి ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ దక్కింది. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ త్రినాథరావు గారికి కృతజ్ఞతలు. మా హీరో హవీష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అన్నారు.నటుడు మాణిక్ రెడ్డి మాట్లాడుతూ - హవీష్ గారు ఈ సినిమా గురించి చాలా రోజుల కిందట నాతో చెప్పారు. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ చేస్తున్నాను త్రినాథరావు గారితో అన్నారు. ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ ఎంటర్ టైన్ చేస్తుంది. నాకు కూడా మంచి రోల్ ఇచ్చారు. ఎంతోమంది దర్శకులు టాలీవుడ్ లో ఎంటర్ టైనింగ్ మూవీస్ చేస్తున్నారు. వారి లిస్టులో త్రినాథరావు గారు కూడా ఉంటారు. ఈ కథలో ఎక్కడ అవకాశం దొరికినా ఆయన నవ్వించే సీన్స్ చేయించారు. కథ బాగున్న ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. నేను రెడీ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని నమ్మకంతో చెబుతున్నా. అన్నారు.నటి రూప లక్ష్మి మాట్లాడుతూ - మంచి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఆర్టిస్టులకు ఎంతో సంతృప్తి దక్కుతుంది. అలాంటి అవకాశం నేను రెడీ చిత్రంతో నాకు దక్కింది. ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు మేమంతా హ్యాపీగా ఫీలయ్యాం. ఇదే సంతోషం థియేటర్స్ లో ప్రేక్షకులకూ అందించబోతున్నాం. అన్నారు.నటి మహతి మాట్లాడుతూ - నేను రెడీ మూవీలో నటించే అవకాశం రావడం హ్యాపీగా ఉంది. డైరెక్టర్ త్రినాథరావు గారి మూవీస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ధమాకా చిత్రంలో అవకాశం వస్తుందని ఆశించాను. ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ ఉంటుంది. నేను ఎన్నో సీరియల్స్ లో నటించాను. ఇప్పుడు మూవీస్ ద్వారా ప్రేక్షకుల అభిమానం పొందాలని ప్రయత్నిస్తున్నా. అన్నారు.నటి హరితేజ మాట్లాడుతూ - హవీష్ గారికి ఈ బర్త్ డే ఎంతో స్పెషల్ కావాలని కోరుకుంటున్నా. నేను రెడీ సినిమా నుంచి ఆయనతో పాటు మా అందరికీ సక్సెస్ దక్కాలి. ఈ సినిమాకు 3 రోజులు షూటింగ్ చేశాను. ఈ అవకాశం ఇచ్చిన  మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్. నేను రెడీ సినిమా చూస్తూ ప్రేక్షకులు బాగా ననవ్వుకుంటారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.నటుడు గోపరాజు రమణ మాట్లాడుతూ - నేను రెడీ సినిమాలో నేనొక మంచి రోల్ చేశాను. ఈ చిత్రంలో ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్ ఆకట్టుకుంటాయి. మధ్య తరగతి లైఫ్ లో ఉండే అన్ని ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని త్రినాథరావు గారు రూపొందించారు. నేను రెడీ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. అన్నారు.

ఎడిటర్ ప్రవీణ్ పూడి మాట్లాడుతూ - నేను రెడీ సినిమా హవీష్ గారికి పెద్ద సక్సెస్ ఇవ్వాలి. అలాగే మా డైరెక్టర్ త్రినాథరావు గారితో వర్క్ చేసిన ఎక్సిపీరియన్స్ హ్యాపీగా ఉంది. ఈ సినిమా ఔట్ పుట్ చాలా బాగా వస్తోంది. నేను రెడీ మూవీ టీమ్ అందరికీ మంచి సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.

స్టోరీ, డైలాగ్ రైటర్ విక్రాంత్ శ్రీనివాస్ మాట్లాడుతూ - ఈ మధ్య ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు రావడం లేదు అంటున్నారు. కానీ  నేను రెడీ సినిమాతో మేము రెడీగా ఉన్నాం. ఈ చిత్రంతో ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా థియేటర్స్ కు తప్పకుండా వస్తారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో మనమంతా ఏది కావాలని కోరుకుంటామో ఆ ఎలిమెంట్ తో ఈ సినిమా చేశాం. డైరెక్టర్ త్రినాథరావు గారు చాలా కాలంగా నాకు పరిచయం. అయితే ఈ సినిమాతో ఆయనతో వర్క్ చేసే అవకాశం దొరకడం సంతోషంగా ఉంది. అన్నారు.

ప్రొడ్యూసర్ నిఖిల కోనేరు మాట్లాడుతూ - నేను రెడీ చిత్రంతో నిర్మాతగా అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది. మా నాన్నగారు జీనియస్, రాక్షసుడు వంటి సూపర్ హిట్స్ మూవీస్ చేశారు. విద్యారంగంలో ఎంతో సేవ చేస్తున్నారు.  ఆయన లెగసీని ముందుకు తీసుకువెళ్లాలి అనేది నా డ్రీమ్. ఇప్పటికే నేను విద్యారంగంలో నాన్న లెగసీని కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఆ ప్రయత్నం ప్రారంభించాను. నా మొదటి చిత్రాన్ని త్రినాథరావు గారి లాంటి పెద్ద దర్శకుడితో ప్రొడ్యూస్ చేయడం హ్యాపీగా ఉంది. ఆయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఎప్పుడు ఇంటికి వచ్చినా నవ్విస్తారు. ఆయన ఎక్సిపీరియన్స్ నుంచి ఎంతో నేర్చుకున్నాం. మిక్కీ, ప్రవీణ్, నిజార్ వంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ మా మూవీకి వర్క్ చేశారు. మా హీరోయిన్ కావ్య థాపర్ బాగా కోపరేట్ చేస్తూ నటించింది. నేను రెడీ సినిమాతో సూపర్ హిట్ మూవీ ఇవ్వాలని అనుకుంటున్నా. మీ అందరి సపోర్ట్ కావాలి. అన్నారు.

హీరోయిన్ కావ్య థాపర్ మాట్లాడుతూ - నేను రెడీ మూవీ పక్కా ఎంటర్ టైనర్. హవీష్ లాంటి మంచి హీరోతో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. మా డైరెక్టర్ త్రినాథరావు గారు ఈ మూవీని కంప్లీట్ ఫన్ తో రూపొందించారు. ఈ రోజు మేము చూపించింది చిన్న గ్లింప్స్ మాత్రమే. మూవీలో మీకు కావాల్సినంత వినోదం ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకునే చిత్రమిది. నేను రెడీ నుంచి రిలీజ్ చేసే ప్రతి కంటెంట్ మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు. హీరో హవీష్ మాట్లాడుతూ - ఈ బర్త్ డే నాకు ఎంతో స్పెషల్. చాలా మంది నుంచి విశెస్ అందుకున్నా. నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. నువ్విలా, జీనియస్, సెవెన్ వంటి మూవీస్ తో నన్ను ప్రేక్షకులు బాగా ఆదరించారు. వారి సపోర్ట్ ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. గ్యాప్ తీసుకోకుండా మూవీస్ చేయమని నా వెల్ విషర్స్ చెబుతుంటారు. నాకు ప్రతి రోజూ ఓ సినిమా రిలీజ్ చేయాలని ఉంటుంది. కానీ లో క్వాలిటీ మూవీస్ చేయకూడదు. మంచి స్టాండర్డ్స్ లో చేయాలనుకుంటా. మంచి అవకాశాలు రావాలని రోజూ కోరుకుంటా. త్రినాథరావు గారితో ఎప్పుడో మూవీ చేయాల్సింది. కానీ ఆయన బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. నేను రెడీ మూవీతో ఆ అవకాశం రావడం సంతోషంగా ఉంది. నేను రెడీ బ్రిలియంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ, త్రినాథరావు గారి అన్ని మూవీస్ లో కల్లా ఈ సినిమాకే బెస్ట్ స్క్రిప్ట్ కుదిరిందని చెప్పగలను. ఈ చిత్రంలో ప్రతి యాక్టర్ బాగా పర్ ఫార్మ్ చేశారు. మిక్కీ గారి మ్యూజిక్, నిజార్ గారి విజువల్స్ బ్యూటిఫుల్ గా ఉంటాయి. ప్రవీణ్ పూడి గారు కూడా నేను అడగగానే వచ్చి వర్క్ చేశారు. మా ఈవెంట్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీ అందరినీ థియేటర్స్ లో కలిసేందుకు వెయిట్ చేస్తున్న అన్నారు.

Tags:

About The Author

Latest News

బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు
బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్ 
పూరిజగన్నాథున్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 
మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు 
ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు "తమ్ముడు" మూవీకి సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు
అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...