ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు "తమ్ముడు" మూవీకి సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు

ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు

లోక‌ల్ గైడ్

"సంక్రాంతికి వస్తున్నాం" బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న మరో సూపర్ హిట్ మూవీ "తమ్ముడు".  తాజాగా సెన్సార్ కార్యక్రమాలు ముగించుకున్న ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు 'ఎ' సర్టిఫికెట్ ఎంచుకున్నారు. కట్స్ తో ఈ సినిమాకు 'యు/ఎ' సర్టిఫికెట్ లభించేది. అయితే ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు నిర్మాత దిల్ రాజు 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్నారు. ఇటీవల "తమ్ముడు" మూవీ కోసం చేసిన ఇంటర్వ్యూస్ లో దిల్ రాజు ఏ తరహా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయో స్పష్టంగా చెప్పారు. "సంక్రాంతికి వస్తున్నాం" లాంటి కంప్లీట్ ఎంటర్ టైనర్స్ లేదా సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చే సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్తున్నారని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే "తమ్ముడు" సినిమాకు ఒక కొత్త తరహా సినిమాటిక్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించేందుకు కట్స్ లేకుండా 'ఎ' సర్టిఫికెట్ తీసుకునేందుకే దిల్ రాజు మొగ్గుచూపారు. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జూలై 4న "తమ్ముడు" సినిమా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Tags:

About The Author

Latest News

ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్ల ఎత్తి నీరు విడుదల ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్ల ఎత్తి నీరు విడుదల
    గండిపేట్ (లోకల్ గైడ్); ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్లను అధికారులు బుధవారంసాయంత్రం ఓపెన్ చేశారు. జలాశయం ఎగువ ప్రాంతాలైన రంగారెడ్డి వికారాబాద్ జిల్లాలో భారీగా
దేశంలో సాంకేతిక రంగం అభివృద్ధికి ఆధ్యుడు  రాజీవ్ గాంధీ
పట్టణంలో పారిశుధ్య పనులు పరిశీలించిన కలెక్టర్
చివరి శ్వాస వరకు ప్రజాసేవలోనే ఉంటాం  ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణిక రెడ్డి మాజీ డిసిసి అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి
నల్లగొండ జిల్లా పోటో జర్నలిస్టులకు రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ అవార్డులు.
విధ్వంసానికి గురి అయిన వరంగల్ మహా నగరాన్ని తీర్చిదిద్దండి
మహిళా పోలీసులు లక్ష్యం దిశగా పనిచేయాలి