*ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
By Ram Reddy
On
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ కలెక్టర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.. ఈ సందర్బంగా జిల్లా స్థితిగతులపై చర్చిస్తూ ఇందూర్ నగరం అభివృద్ధిపైన ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలియజేసారు.
జిల్లా అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా తన సహాయాసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని ఎమ్మెల్యే తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళలక్ష్మినారాయణ,ప్రభాకర్, ఆనంద్, పవన్ ముందడ, మరవర్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
18 Jun 2025 19:17:40
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు...