అలరించిన చిరుతల రామాయణం
కేసరి కళావేదిక అధ్యక్షులు తగిలి వెంకటపతి

లోకల్ గైడ్ నాగర్ కర్నూల్ జిల్లా
గ్రామ కళాకరుల ఆధ్వర్యంలో చిరుతల రామాయణ నాటకం అలరించిందని కేసరి కళా వేదిక అద్యక్షులు తగిలి వెంకటపతి అన్నారు.నాగర్ కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం బొప్పల్లి గ్రామంలో సోమవారం రాత్రి గ్రామ పెద్దలు యువకుల సహాయ సహకారంతో బొప్పల్లి గ్రామ కళాకారులు మాస్టర్ పరశురాం మరియు లింగస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన నాటకం ఎంతగానో ఆకట్టుకున్నదని అన్నారు.నిర్వాహకుల ఆహ్వానం మేరకుఅదే గ్రామానికి చెందిన సీనియర్ రంగస్థల కళాకారులు తగిలి వెంకటపతి మాట్లాడుతూ అంతరించిపోతున్న మన సాంప్రదాయ కలలను కాపాడుకోవడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని అని వివిధ నాటక సమాజాల ద్వారా సమాజంలో నీతి, న్యాయం, ధర్మాలను విరివిగా ప్రచారం చేశాయని, టీవీలు సామాజిక మాధ్యమాల కాలంలో కూడ ఇంకా గ్రామాలలో రామాయణం నాటకం ద్వారా ప్రజా కళలకు ఆధరణ తగ్గలేదని కళా సంస్కృతి ఉన్నదని,తెలుగు నాటకరంగం చాలా గొప్ప చరిత్రను కలిగి ఉందనినాటక కళలను కాపాడుకోవాలనీ పిలుపిచ్చారు. వారి సొంత గ్రామస్తులైన కళాకారులను గౌరవించి అభినందించారు.
About The Author
Latest News
