అరటి పండు తినడానికి సరైన సమయం ఎప్పుడంటే?

అరటి పండు తినడానికి సరైన సమయం ఎప్పుడంటే?

అరటి పండ్లు సంవత్సరమంతా అందుబాటులో ఉండే పండ్లలో ఒకటి. ఇతర పండ్లతో పోలిస్తే తక్కువ ధరలో లభించే ఈ పండ్లను అన్ని వర్గాల ప్రజలు తినగలుగుతారు. అయితే, అరటి పండ్లను ఎప్పుడు తినాలో, ఎప్పుడు తినకూడదో చాలామందికి తెలియదు. ఈ సందేహానికి పోషకాహార నిపుణుల మాటల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి:

 వ్యాయామం ముందు

ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం చేయడానికి 30 నిమిషాల ముందు అరటి పండ్లను తినడం మంచిది. శారీరక శ్రమ చేసే వారు కూడా పని మొదలుపెట్టే ముందు తింటే శక్తి లభిస్తుంది. అరటి పండ్లలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ వంటి సహజ చక్కెరలతో పాటు తేలికగా జీర్ణమయ్యే పిండి పదార్థాలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. వ్యాయామం చేసే వారు లేదా శ్రమించే వారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి.

 బ్రేక్ ఫాస్ట్ తర్వాత

ఉదయం నాస్తా చేసిన తర్వాత అరటి పండు తినాలంటే కనీసం 40 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. ఇలా చేస్తే నాస్థాలోని పోషకాలు శరీరానికి సరిగ్గా అందుతాయి. బాగా పండిన అరటి పండ్లు పెక్టిన్ అనే పదార్థాన్ని కలిగి ఉండి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుతాయి. కాస్త పచ్చిగా ఉన్న అరటి పండ్లను బరువు తగ్గాలనుకునే వారు తినవచ్చు, ఎందుకంటే ఇవి కడుపు నిండిన భావన కలిగించి అధికాహారం తీసుకోవకుండా చేస్తాయి.

రాత్రి పూట తినరాదు

ఆయుర్వేదం ప్రకారం రాత్రిపూట అరటి పండ్లు తినకూడదు, ముఖ్యంగా కఫం సమస్య ఉన్నవారు. ఇవి శ్లేష్మాన్ని పెంచి దగ్గు, జలుబు లాంటి సమస్యలకు దారితీయొచ్చు. వ్యాయామం లేదా పని చేసిన వెంటనే తినకూడదు. కనీసం 30 నిమిషాల విరామం తర్వాత తినాలి.

 సలాడ్‌లలో మిక్స్ చేయడం మంచిదే

అరటి పండ్లను ఇతర పండ్ల ముక్కలతో కలిపి సలాడ్ రూపంలో తినడం ద్వారా వివిధ రకాల పోషకాల ప్రయోజనాలు పొందవచ్చు అని నిపుణులు సూచిస్తున్నారు.


సరైన సమయంలో, సరైన పద్ధతిలో అరటి పండ్లను తీసుకుంటే శక్తిని పెంచడమే కాక, ఆరోగ్యానికీ అనేక లాభాలు కలుగుతాయి.

Tags:

About The Author

Latest News

పద్బాంధవులుగా 108 సిబ్బంది. పద్బాంధవులుగా 108 సిబ్బంది.
లోకల్ గైడ్ (తాండూర్); దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన 108 అంబులెన్స్ సేవలు జిల్లావ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతుంది.ప్రమాదం జరిగిన ఆపదలో ఉన్నవారికి సంజీవినిలా...
రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచాలి
భేటీ బచావో ....! భేటీ పడావో ....!!
యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ లోని స్టేజ్ -1 లోని  800 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం కలిగిన ఒకటవ యూనిట్ ను  జాతికి అంకితం చేసిన రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ,ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు.
విజయవంతమైన ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
దేశుముఖ్ లను, భూస్వాములను తర్మిన మహావీరుడు కామ్రేడ్ కాచం కృష్ణమూర్తి.
అర్హత ఉన్న వారందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నాం