యోగా,ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం.

యోగా,ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత శారీరక ఆరోగ్యం.

జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. 

నల్లగొండ,.(లోకల్ గైడ్)

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కారించుకొని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో మిషన్ పరివర్తన్ యాంటీ డ్రగ్ వారోత్సవాలలో భాగంగా యోగా కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై మాట్లాడుతూ యోగా అనేది పురాతన ఆధ్యాత్మిక అభ్యాసం మని యోగా చేయడం ద్వారా మనసు,శరీరాన్ని ఏక దాటిపై తీసుకొని రావచ్చని అన్నారు.ముఖ్యంగా పోలీసు ఉద్యోగంలో యోగా ధ్యానం అనేది చాలా అవసరం 24 గంటలు విధినిర్వహణలో అనేక సమస్యలు ఎదురవుతాయని అలాంటపుడు మానసిక ప్రశాంతత కొరకు ప్రతి రోజు ఈ యోగా,ధ్యానం చేయడం ద్వారా ఆందోళన,వత్తిడి తగ్గి శరీరంలో నూతన ఉత్తేజాన్ని నింపుటకు ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి,ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు ఆర్.ఐలు, ఎస్.ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా... సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాచీన దివ్యా ఔషధం యోగా...
  ప్రతిరోజు యోగా చేయడం మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది... జిల్లా ప్రధాన న్యాయమూర్తి భారత లక్ష్మి... నిజామాబాద్,(లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో గల
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం..
పిజెఆర్ స్టేడియంలో ఘనంగా యోగా దినోత్సవం...
రైళ్లలో సెల్ ఫోన్లు చోరీ చేసే దొంగ అరెస్ట్...
ఆరోగ్యకర జీవితానికి ప్రధాన సూత్రం యోగ 
యోగ సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యం 
సంపూర్ణ ఆరోగ్యం యోగాతోనే సాధ్యం... ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ...