అహ్మదాబాద్ విమాన ప్రమాదం – బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణలో కేంద్రం

అహ్మదాబాద్ విమాన ప్రమాదం – బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణలో కేంద్రం

లోక‌ల్ గైడ్ : అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఇటీవల కూలిన ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్స్‌లను అధికారులు విజయవంతంగా రికవర్ చేసి, వాటిలోని డేటాను ఢిల్లీలోని విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) ల్యాబ్‌కు తరలించారు.ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) మరియు ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) నుంచి డేటా డౌన్‌లోడ్ చేసి, పూర్తిస్థాయి విశ్లేషణ చేపట్టారు. ముందు భాగంలో ఉన్న బ్లాక్ బాక్స్ నుంచి క్రాష్ ప్రొటెక్షన్ మాడ్యూల్‌ను సురక్షితంగా రికవర్ చేసినట్టు, అలాగే మెమోరీ మాడ్యూల్‌ను సజీవంగా బయటకు తీశామని అధికారులు తెలిపారు.విమాన దుర్ఘటనకు గల కారణాలను ఖచ్చితంగా గుర్తించేందుకు, ఈ CVR, FDR డేటా కీలకంగా ఉండనుందని కేంద్ర సివిల్ ఏవియేషన్ శాఖ వెల్లడించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఈ విశ్లేషణల ద్వారా తేలనున్నాయి.అహ్మదాబాద్‌ నగరంలో ఒక ఇంటి పైకప్పు నుంచి బ్లాక్ బాక్సులు రికవర్ చేసినట్టు అధికారులు తెలిపారు. CVRను జూన్ 13న, FDRను జూన్ 16న వెలికితీసినట్టు వివరించారు. వీటిని పోలీసుల భద్రత మధ్య, CCTV నిఘాలో ఉంచి జూన్ 24న ఢిల్లీకి తరలించారు.ప్రస్తుతం ఫ్రంట్, రియర్ బ్లాక్ బాక్సులు AAIB ల్యాబ్‌లో ఉండగా, వాటి ఆధారంగా సమగ్రంగా ప్రమాదానికి గల కారణాలు వెల్లడి అయ్యే అవకాశముంది. AAIB అధికారులు ఈ దర్యాప్తును తుది అంచనా దాకా తీసుకెళ్లేందుకు చర్యలు ముమ్మరం చేశారు.

Tags:

About The Author

Latest News

బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు బీసీల అందరం కలిసికట్టుగా ఉంటే మన రాజ్యాధికారం మనమే పాలించవచ్చు
బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సురేష్ దాస్ 
పూరిజగన్నాథున్ని దర్శించుకున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ 
మైనర్ పిల్లలను పనిలో పెట్టుకుంటే చట్ట ప్రకారం కఠినమైన చర్యలు 
ప్రేక్షకులకు సరికొత్త సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇచ్చేందుకు "తమ్ముడు" మూవీకి సెన్సార్ నుంచి 'ఎ' సర్టిఫికెట్ తీసుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు
అనంతపురంలో భారీ పరిశ్రమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
గుంటూరులో పోలీసు ఏఐ హ్యాకథాన్‌కు సీఎం చంద్రబాబు ప్రారంభం
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలసిన మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ శ్యాం బాబు...