మైథలాజికల్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'అరణ్య ధార' నుండి ఫస్ట్ సింగిల్ గా 'యుగానికే ప్రయాణమే' సాంగ్ విడుదల
బాలు నాయుడు,ఆశా సుదర్శన్ జంటగా నటించిన సస్పెన్స్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ 'అరణ్య ధార'.కొత్త కంటెంట్ ను ఆదరించేందుకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. అందులోనూ మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలని ఇప్పుడు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతో 'సిల్వర్ స్క్రీన్ షాట్స్' బ్యానర్ పై నిర్మాత బాలు నాయుడు అండ్ టీం 'అరణ్య ధార'ని రూపొందించారు. దర్శక ద్వయం శివ పచ్చ, బాలు నాయుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు వెల్లడించారు మేకర్స్. తాజాగా 'అరణ్య ధార' నుండి ఫస్ట్ సింగిల్ గా 'యుగానికే ప్రయాణమే' అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ అయినటువంటి రఘు కుంచె చేతుల మీదుగా లాంచ్ చేశారు. రవి నిడమర్తి సంగీతంలో రూపొందిన ఈ పాటని అమన్ సిద్ధికి ఆలపించగా బాలు నాయుడు సాహిత్యం సమకూర్చడం మరో విశేషంగా చెప్పుకోవాలి.
సాంగ్ లాంచ్ అనంతరం రఘు కుంచె మాట్లాడుతూ.. "ఇప్పుడే 'అరణ్య ధార' నుండి 'యుగానికే' అనే సాంగ్ లాంచ్ చేయడం జరిగింది. ఈ పాటలో నేచర్ ని బాగా చూపించారు.అలాగే బాగా షూట్ చేశారు కూడా. వింటున్నప్పుడు చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది. ఇందులో హీరో ఒక ఫోటోగ్రాఫర్.ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను" అంటూ తెలిపారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు :
బాలు నాయుడు,ఆశ సుదర్శన్, రేవతి నాధ, వెంకట్ పసుపులేటి, నాయకంటి స్వేతాంజలి, ప్రసాద్ పూసల,సంజయ్ సముద్రాల, జంజుర్ నిఖిల్ తదితరులు
దర్శకత్వం : శివ పచ్చ, బాలు నాయుడు
నిర్మాత : బాలు నాయుడు
నిర్మాణ సంస్థ : సిల్వర్ స్క్రీన్ షాట్స్
సంగీతం : రవి నిడమర్తి
సినిమాటోగ్రఫీ : చైతన్య దామెర్ల
పీఆర్ఓ : ఫణి కుమార్ పులపర్తి
About The Author
Related Posts
