8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ:

యశోద ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం

Published On
8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ:

 

 ఖమ్మం ప్రతినిధి, జూన్ 10:లోకల్ గైడ్ :

ఖమ్మం ప్రెస్ క్లబ్ లో యశోద హాస్పిటల్ డాక్టర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు వారు చెప్పిన వివరాల ప్రకారం పుట్టుకతోనే వచ్చే వినికిడి లోపాలు పిల్లల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తున్న తరుణంలో, ఆధునిక వైద్య సాంకేతికత ఒక బాలిక జీవితంలో కొత్త వెలుగులు నింపింది. కల్వకుర్తికి చెందిన 8 ఏళ్ల బాలికకు కుడి చెవిలో వినికిడి లోపం (రైట్ మైక్రోటియా) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. మలక్‌పేట్ యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఆమెకు అత్యాధునిక శస్త్రచికిత్స అందించి, వినికిడిని విజయవంతంగా పునరుద్ధరించారు.
*అత్యాధునిక 'OSIA 300' ఇంప్లాంట్**
ప్రముఖ కన్సల్టెంట్ ఈఎన్టీ సర్జన్ *డా. రఘు కుమార్ ఎస్.సి.హెచ్ఆ ధ్వర్యంలో బాలికకు అత్యంత ఆధునికమైన OSIA 300' బోన్ కన్డక్షన్ హియరింగ్ ఇంప్లాంట్** శస్త్రచికిత్స నిర్వహించారు.
  ప్రత్యేకత: ఇది ఒక మినిమల్లీ ఇన్వేసివ్ (స్వల్ప శస్త్రచికిత్స) విధానం. ఇందులో శబ్ద తరంగాలు నేరుగా అంతర్గత చెవికి అందుతాయి.
 ఫలితం: ఎటువంటి అంతర్గత సమస్యలు లేకుండా ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం బాలిక పూర్తిగా కోలుకుని, స్థిరమైన ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యింది.
ముందస్తు చికిత్సే కీలకం: వైద్యుల అభిప్రాయం "మైక్రోటియా సమస్య ఉన్న పిల్లల్లో OSIA వంటి బోన్ కన్డక్షన్ ఇంప్లాంట్లు అద్భుతంగా పనిచేస్తాయి. సకాలంలో స్పందించి ఈ సర్జరీ చేయడం వల్ల బాలిక మాటలు, భాషా నైపుణ్యాలు మెరుగై, భవిష్యత్తు బాగుంటుంది."
డా. రఘు కుమార్, ఈఎన్టీ సర్జన్
 
యశోద ఆసుపత్రి యాజమాన్యం హర్షం
క్లిష్టమైన పీడియాట్రిక్ వినికిడి సమస్యలను కూడా అత్యున్నత ప్రమాణాలతో నయం చేయగలగడం తమ ప్రత్యేకత అని యశోద ఆసుపత్రి యాజమాన్యం పేర్కొంది. ఆసుపత్రి డైరెక్టర్ శ్రీ గోరుకంటి పవన్, యూనిట్ హెడ్ శ్రీ కె. శ్రీనివాస్ రెడ్డి, అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ శ్రీనివాస్ చిదుర మాట్లాడుతూ... అత్యాధునిక సాంకేతికత, నిపుణులైన వైద్యుల సమన్వయంతోనే ఈ విజయం సాధ్యమైందని, పిల్లల భవిష్యత్తును మెరుగుపరచడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News

8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ: 8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ:
      ఖమ్మం ప్రతినిధి, జూన్ 10:లోకల్ గైడ్ : ఖమ్మం ప్రెస్ క్లబ్ లో యశోద హాస్పిటల్ డాక్టర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు వారు చెప్పిన వివరాల
వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పని చేయాలి ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
రైతులు  విత్తనాల విక్రయాలలో నిబంధనలు పాటించాలి
మహిళల భాగస్వామ్యంతో మహిళా శక్తి సూపర్ మార్కెట్లు
సిద్దిపేట కమిషనరేట్‌లో పదోన్నతి పొందిన పోలీసు అధికారులకు సీపీ అభినందనలు
గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన సింగరేణి కార్మికుడు...
మదారి లక్ష్మి దశదిన కర్మల్లో పాల్గొన్న బడే నాగజ్యోతి