నీట్ రీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు....

రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా.

Published On
నీట్ రీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు....

 

 


మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్)


నీట్ రీ పరీక్ష నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా భారతీయ నాగరిక భద్రతా సంహిత బిఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్163,పూర్వపు సెక్షన్144ప్రకారం నిషేధాజ్ఞలను అమలులో ఉంటాయని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు.ఈ ఉత్తర్వులు 21ఆదివారం ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు అమలులో ఉంటాయని,వాటిని ఎవరైనా ఉల్లంఘించిన పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.మంచిర్యాల జోన్‌లోని మొత్తం 5పరీక్ష కేంద్రాలైన ప్రభుత్వ డిగ్రీ కళాశాల,ప్రభుత్వ ఉన్నత పాఠశాల,తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కళాశాల,జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల,జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల,మంచిర్యాలలో ఆదివారం మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.పరీక్ష కేంద్రాల పరిసరాల్లో ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదని,సభలు,సమావేశాలు,ర్యాలీలు, ధర్నాలు నిర్వహించడం నిషేధించబడిందని పేర్కొన్నారు.అదేవిధంగా పరీక్ష కేంద్రాలకు 500మీటర్ల పరిధిలో ఉన్న అన్ని జిరాక్స్ కేంద్రాలను 21న ఉదయం 6గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు మూసివేయాలని ఆదేశించారు.పరీక్షల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.

Tags:

About The Author

Latest News

నీట్ రీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు.... నీట్ రీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు....
        మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) నీట్ రీ పరీక్ష నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న పరీక్ష కేంద్రాల వద్ద
ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం కోసం అంగన్వాడీల కృషి అభినందనీయం -గుడిమల్కాపూర్ డైరెక్టర్ బండారి శంకర్
రవీంద్రభారతిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వి హెచ్ హనుమంతరావుకు ఘన సన్మానం 
8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ:
వ్యవసాయం, సాగునీటి నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళికతో పని చేయాలి ... జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
రైతులు  విత్తనాల విక్రయాలలో నిబంధనలు పాటించాలి
మహిళల భాగస్వామ్యంతో మహిళా శక్తి సూపర్ మార్కెట్లు