- District News
- Ranga Reddy
- ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం కోసం అంగన్వాడీల కృషి అభినందనీయం -గుడిమల్కాపూర్ డైరెక్టర్ బండారి శంకర్
ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం కోసం అంగన్వాడీల కృషి అభినందనీయం -గుడిమల్కాపూర్ డైరెక్టర్ బండారి శంకర్
Published On
By Ram Reddy
.
ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం అంగన్వాడీలు చేసిన కృషి అభినందనీయమని గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి శంకర్ అన్నారు. శనివారం శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీలోని అంగన్వాడి కేంద్రంలో నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడి బాట కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి కేంద్రాల్లో ప్రభుత్వం అందించే పౌష్టిక ఆహారం చిన్నారులతోపాటు గర్భిణీలు బాలింతలు ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. ప్రధానంగా చిన్నారులకు అందించే పౌష్టిక ఆహారంతో భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం అవుతుందన్నారు. ఈ సందర్భంగా చిన్నారులచే అక్షరాభ్యాసం చేయించారు. అదేవిధంగా చిన్నారులకు స్కూల్ యూనిఫామ్ ను అందజేశారు. ముందుగా చిన్నారులచే ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడి భవన నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్లే దృష్టికి తీసుకెలుతానన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ ఎం జ్యోతి, ఆయా సంగీత, పబ్లిక్ హెల్త్ మేనేజర్ గౌరీ , ఆశా వర్కర్ స్థానిక నాయకులు డి రమేష్, ఎన్ శేఖర్, డి ఆంజనేయులు, పాల్గొన్నారు.
Tags:
About The Author
Related Posts
Latest News
20 Jun 2026 22:35:26
.
రాజేంద్ర నగర్ : ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం కోసం అంగన్వాడీలు చేసిన కృషి అభినందనీయమని గుడి మల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి శంకర్ అన్నారు....
