పుట్టిన రోజు నాడే గుండెపోటుతో వైద్య విద్యార్థి మృతి....

పుట్టిన రోజు నాడే గుండెపోటుతో వైద్య విద్యార్థి మృతి....

 గ్రామంలో అలుముకున్న విషాధ ఛాయలు...

 ఫిలిప్పీన్స్ లో  చోటుచేసుకున్న విషాద ఘటన..

నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్)

ఫిలిప్పీన్స్ లో డోంగ్లీ మండలంలోని కుర్లా గ్రామానికి చెందిన వైద్య విద్యార్ధి అయిన వడ్ల యోగి అనే వైద్య విద్యార్థి పుట్టినరోజున గుండెపోటుతో మృతిచెందాడు. పుట్టినరోజు నాడే మృతి చెందడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి...పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.. డోంగ్లీ మండలం కుర్ల గ్రామానికి చెందిన యోగి మూడేళ్ల క్రితం ఎంబీబీఎస్ కోసం ఫిలిప్పీన్స్ వెళ్లాడు. కళాశాలకు సెలవులు ఇవ్వడంతో 3 నెలల క్రితం స్వగ్రామానికి వచ్చి 15 రోజుల క్రితం తిరిగి ఫిలిప్పీన్స్ అక్కడికి చేరుకున్నాడు. బుధవారం యోగి పుట్టినరోజు కావడంతో ఉదయం 8 గంటలకు అతడి కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఛాతీలో నొప్పి వస్తుందని యోగి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పగా.. ఆస్పత్రికి వెళ్లాలని ఆయన సూచించారు. స్నేహితుల సహాయంతో ఆస్పత్రికి వెళ్తుండగా మెట్లు దిగే క్రమంలో యోగి కుప్పకూలిపోయాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధరించారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు అతడి స్నేహితులు తెలిపారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు.

Tags:

About The Author

Latest News

అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం అధ్యక్షుల వారి ఆత్మీయ ఆలింగనం
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రాంచందర్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేసిన  బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి  లోకల్ గైడ్ షాద్ నగర్...
బైపాస్ రోడ్డుకు భారీ గండి!
#Draft: Add Your Title
బాలానగర్ నాలాను పరిశీలించిన
అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల అమలు...
అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు.
మలబార్ గోల్డ్ కంపెనీ ఓపెనింగ్