పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదు చేసుకోవాలి: 

మాజీ శాసనసభ్యులు డాక్టర్ మెతుకు ఆనంద్

Published On
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదు చేసుకోవాలి: 

 

- 

లోకల్ గైడ్ వికారాబాద్ జిల్లా బ్యూరో ప్రతినిధి :

పట్టభద్రుల శాసనమండలి (ఎమ్మెల్సీ) ఎన్నికలలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని వికారాబాద్ మాజీ శాసనసభ్యులు, డాక్టర్ మెతుకు ఆనంద్ పిలుపునిచ్చారు. భారతీయ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వికారాబాద్, పరిగి ప్రాంతాలకు చెందిన ఉన్నత చదువులు చదివిన వైద్యులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ... పట్టభద్రుల ఎన్నికల ప్రాముఖ్యతను వివరించారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఓటరుగా నమోదై ఓటు వేసినప్పటికీ, ప్రస్తుతం మళ్లీ క్రొత్తగా ఓటరు నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. సమాజంలో అత్యంత బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న వైద్యులు ఎన్నికల ప్రక్రియలో చురుగ్గా పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
మాజీ శాసనసభ్యులు చేసిన ఈ విజ్ఞప్తికి సమావేశంలో పాల్గొన్న వైద్యులందరూ సానుకూలంగా స్పందించారు. ఓటరు నమోదుకు కావలసిన తమ సంబంధిత పత్రాలను ఆయనకు అందజేశారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడూ ఓటు హక్కు పొందేలా చూసేందుకు ఓటరు నమోదు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని డాక్టర్ మెతుకు ఆనంద్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News

ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల కూల్చివేత ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల కూల్చివేత
మంచాల రోడ్డులో ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉన్న దుకాణాలు, బోర్డులు క్లియర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక
రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవండి.. వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదు చేసుకోవాలి: 
ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చేతుల మీదుగా కొత్తూరు తండా ఆలయ స్వాగత తోరణానికి శంకుస్థాపన!
సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో మున్సిపల్ చైర్ పర్సన్  వైస్ చైర్పర్సన్ రాజీవ్ గృహకల్ప  కాలనీలో సిసి రోడ్లు  అభివృద్ధి
పొంగులేటి శ్రీనన్నపై ప్రేమకు మాదారం వేదిక.. అభిమానానికి వర్షం అడ్డుకాదు!
రక్తదానం ప్రాణదానంతో సమానం...