ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల కూల్చివేత

ఉపాధ్యాయ కాలనీలో అనుమతికి మించి నిర్మించిన అంతస్తుల తొలగింపు

మంచాల రోడ్డులో ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉన్న దుకాణాలు, బోర్డులు క్లియర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక
Published On
ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల కూల్చివేత

IMG-20261030-WA0044IMG-20261030-WA0045

ఇబ్రహీంపట్నం అక్టోబర్ 29 ( లోకల్ గైడ్ )

 

ఇబ్రహీంపట్నం పురపాలక సంఘం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలు, రహదారుల ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు. గురునానక్ ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న ఉపాధ్యాయ కాలనీలో అనుమతికి మించి అదనంగా నిర్మించిన అంతస్తులను మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది గురువారం ప్రత్యేక డ్రైవ్ చేపట్టి కూల్చివేశారు.

మున్సిపాలిటీ నుంచి తీసుకున్న ప్లాన్ అనుమతులకు విరుద్ధంగా భవన నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు స్పష్టం చేశారు. అనుమతి లేని అంతస్తులను జేసీబీ, ప్రత్యేక యంత్రాల సహాయంతో నేలమట్టం చేశారు.

 

మంచాల రోడ్డులో ఆక్రమణల తొలగింపు

 

మరోవైపు పట్టణంలోని ప్రధాన రహదారి అయిన మంచాల రోడ్డులో పాదచారులు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్న ఆక్రమణలను అధికారులు తొలగించారు. రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసుకున్న దుకాణాలు, వ్యాపార ప్రకటనల బోర్డుల వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని, వాణిజ్య సముదాయాలకు వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు ఫిర్యాదు చేశారు...ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన మున్సిపల్ సిబ్బంది.. రహదారిపైకి చొచ్చుకువచ్చిన దుకాణాల విస్తరణలను, అడ్డంకిగా ఉన్న సైన్‌బోర్డులను పూర్తిగా తొలగించి రోడ్డును క్లియర్ చేశారు.

 

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ.. పట్టణంలో ఎవరైనా అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినా, రహదారులను ఆక్రమించి ప్రజలకు అసౌకర్యం కలిగించినా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వ్యాపారులు తమ బోర్డులు, సామగ్రిని రోడ్లపైకి పెట్టరాదని సూచించారు. ఇకపై కూడా పట్టణ పరిధిలో నిరంతరం తనిఖీలు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News

ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల కూల్చివేత ఇబ్రహీంపట్నంలో అక్రమ నిర్మాణాలు, ఆక్రమణల కూల్చివేత
మంచాల రోడ్డులో ట్రాఫిక్‌కు అడ్డంకిగా ఉన్న దుకాణాలు, బోర్డులు క్లియర్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు మున్సిపల్ కమిషనర్ హెచ్చరిక
రక్తదానంతో ప్రాణదాతలుగా నిలవండి.. వ్యసనాలకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకోండి
పట్టభద్రులందరూ ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదు చేసుకోవాలి: 
ఎమ్మెల్యే రాందాస్ నాయక్ చేతుల మీదుగా కొత్తూరు తండా ఆలయ స్వాగత తోరణానికి శంకుస్థాపన!
సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో మున్సిపల్ చైర్ పర్సన్  వైస్ చైర్పర్సన్ రాజీవ్ గృహకల్ప  కాలనీలో సిసి రోడ్లు  అభివృద్ధి
పొంగులేటి శ్రీనన్నపై ప్రేమకు మాదారం వేదిక.. అభిమానానికి వర్షం అడ్డుకాదు!
రక్తదానం ప్రాణదానంతో సమానం...