- District News
- అన్నప్రసాద కార్యక్రమం
అన్నప్రసాద కార్యక్రమం
తుల్జా భవానీ మాత భక్తుల కోసం గజానన్ సేవాసదన్ బాయ్స్ యూత్ సభ్యుల ఉదారత
తుల్జా భవానీ మాత దర్శనార్థం కాలినడకన వెళ్లే భక్తుల ఆకలి, దాహార్తిని తీర్చడానికి సదాశివపేట పట్టణానికి చెందిన ‘గజానన్ సేవాసదన్ బాయ్స్ యూత్’ సభ్యులు ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చారు. తుల్జాపూర్ భవానీ మందిరానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో శిబిరం (స్థావరం) ఏర్పాటు చేసుకుని, ఐదు రోజుల పాటు భక్తులకు అన్నప్రసాదం వితరణ చేయనున్నారు. ఈ కార్యక్రమం నిమిత్తం బుధవారం రాత్రి సదాశివపేటలోని శ్రీ దుర్గా భవానీ మందిరం వద్ద నుండి భక్తులు, యూత్ సభ్యులు వాహనాల్లో బయలుదేరారు.
శాస్త్రోక్తంగా వాహన పూజ – జై భవానీ నినాదాలతో ప్రయాణం ప్రారంభం
ఈ కార్యక్రమానికి సదాశివపేట పట్టణ పురోహితులు సర్వోత్తమ పంతులు గారు విచ్చేసి వాహనాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ‘జై భవానీ.. జై భవానీ’ అనే భక్తినినాదాల మధ్య జెండా ఊపి వాహనాలను ప్రయాణానికి సాగనంపారు.
యువతకు అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి: సర్వోత్తమ పంతులు
ఈ సందర్భంగా పురోహితులు సర్వోత్తమ పంతులు మాట్లాడుతూ... సదాశివపేట పట్టణానికి చెందిన గజానన్ సేవాసదన్ బాయ్స్ యూత్ సభ్యులు ఎంతో మంచి సంకల్పంతో కాలినడక భక్తులకు అన్నప్రసాద సేవ అందించడానికి వెళ్లడం అభినందనీయమన్నారు. తుల్జా భవానీ మాత కృపతో ఈ సభ్యులందరికీ ఎల్లప్పుడూ మంచి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని, భవిష్యత్తులో వీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో గజానన్ సేవాసదన్ బాయ్స్ యూత్ సభ్యులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
