- District News
- Khammam
- కొమరం భీమ్ స్ఫూర్తితో గిరిజన హక్కుల పోరాటం: గుగులోత్ కిషన్ నాయక్
కొమరం భీమ్ స్ఫూర్తితో గిరిజన హక్కుల పోరాటం: గుగులోత్ కిషన్ నాయక్
కొమరం భీమ్ స్ఫూర్తితో ఆదివాసీ గిరిజన హక్కుల కోసం ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని గిరిజన సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గుగులోత్ కిషన్ నాయక్ పిలుపునిచ్చారు.
బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని కొమరం భీమ్ విగ్రహం వద్ద ఆదివాసీ హక్కుల పోరాట యోధుడు, జల్, జంగిల్, జమీన్ పోరాట స్ఫూర్తిదాత కొమరం భీమ్ జయంతి సందర్భంగా దళిత, గిరిజన విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా గుగులోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ, గిరిజనుల సంక్షేమం కోసం ఉన్న పీసా చట్టం, 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం, ఐదు, ఆరు షెడ్యూళ్లలోని ప్రత్యేక చట్టాలను ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అడవిలో ఉన్న ఆదివాసీలను, అక్కడ ఉన్న ఖనిజాల పేరుతో కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం సరికాదని, అడవి నుండి తరిమివేయడం, నిర్వాసితులుగా చేయడం సిగ్గుచేటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలను వెంటనే ఆపాలని, సర్వ హక్కులు అడవిలో ఉన్న ఆదివాసీలకే చెందుతాయని, వాటిని కాపాడుకోవడానికి కొమరం భీమ్ స్ఫూర్తితో ఐక్య పోరాటానికి అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
.ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు వెంకన్న నాయక్,ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు చాగంటి ప్రభాకర్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తప్పెట్ల వీరన్న ఆర్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దుంపల్లి అనిల్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు దేవత్ హేమా నాయక్, ఎల్ హెచ్ పి ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షులు మంగీలాల్ నాయక్,విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు పోలేపాక వెంకన్న, సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షులు నాయక్, సేవాలాల్ సేన జాతీయ కోర్ కమిటీ నాయకులు మోతీలాల్ నాయక్, సుమలత,పద్మ, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
