- District News
- పేదల పాలిట పెన్నిధి పండుగ సాయన్న. - బంట్వారంలో ఘనంగా జయంతి వేడుకలు.
పేదల పాలిట పెన్నిధి పండుగ సాయన్న. - బంట్వారంలో ఘనంగా జయంతి వేడుకలు.
పేదల ఆకలి తీర్చేందుకు జీవితాన్నే పణంగా పెట్టిన మహనీయుడు.
లోకల్ గైడ్/బంట్వారం:
పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా, అణగారిన వర్గాల పక్షాన నిలబడి అన్యాయాలను ఎదిరించిన మహనీయుడు పండుగ సాయన్న అని పలువురు నాయకులు కొనియాడారు. బంట్వారం మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గురువారం పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు.
పేదల ఆకలి తీర్చేందుకు పోరాటం.
పండుగ సాయన్న బుస్వాముల వద్ద నుంచి ధాన్యాన్ని సేకరించి పేదలకు పంచుతూ, ఆకలితో అలమటించే నిరుపేదల కడుపు నింపేందుకు తన జీవితాన్నే పణంగా పెట్టారని నాయకులు పేర్కొన్నారు. పేదల కష్టాలను తన కష్టాలుగా భావించి, వారి సంక్షేమం కోసం నిరంతరం పోరాడిన వ్యక్తిగా ఆయనకు ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు.
దౌర్జన్యాలకు ఎదురొడ్డి.. పేదల పక్షాన.
రజాకార్ల దౌర్జన్యాలను ధైర్యంగా ఎదిరిస్తూ, అణగారిన ప్రజలకు అండగా నిలిచిన పండుగ సాయన్న పోరాట స్ఫూర్తి మరువలేనిదని అన్నారు. అధికారం, ఆధిపత్యం ముందు తలవంచకుండా పేదల పక్షాన నిలబడిన ఆయన జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. సమాజంలో సమానత్వం, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన త్యాగాలను ఎప్పటికీ మరువలేమని తెలిపారు.
పండగ సాయన్న త్యాగాలు చిరస్మరణీయం.
పండుగ సాయన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం, పేదలకు అండగా నిలవడం, సమాజంలో ఐక్యతను పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు పిలుపునిచ్చారు. ఆయన సేవలను భావితరాలకు తెలియజేస్తూ, ఆయన చూపిన బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు శాకం నరసింహులు, పోచారం యాదగిరి, మాజీ సర్పంచ్ బర్కత్‌పల్లి నరసింహులు, నాయకులు చట్నీ రమేష్, ముదిరాజ్ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
