ఆకట్టుకున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

అర్ధరాత్రి వరకు కొనసాగిన  పోటీలు

ప్రీ క్వార్టర్ ఫైనల్ చే ఆరిన నారాయణపేట జిల్లా మహిళల,పురుషుల జట్లు
Published On
ఆకట్టుకున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు

నారాయణపేట ఫిబ్రవరి 21:

మక్తల్ లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సీఎం కప్ కబడ్డీ పోటీలు ఆకట్టుకుంటు న్నాయి. గ్రామాల్లో ఉన్న ప్రతిభను వెలికితీసి దేశానికి నైపుణ్యం గల క్రీడాకారులను అందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న సీఎం కప్ రెండవ ఎడిషన్ లో భాగంగా నారాయణపేట జిల్లా మక్తల్ డిగ్రీ కళాశాల మైదానంలో నిన్నటి నుండి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభమ య్యాయి అర్ధరాత్రి వరకు మ్యాచ్ లు కొనసాగా యి.రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి 66 టీంలు సుమారు 1200మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటున్నా రు.నారాయణపేట జిల్లాలో మొదటిసారిగా మక్తల్ పట్ట ణంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈపోటీలు విజయవంతం కోసం  నారాయణపేట జిల్లా యువజన క్రీడ సమైక్య ఆధ్వ ర్యంలో అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.

ఆకట్టుకున్న నారాయణపేట జిల్లా మహిళ,పురుషుల టీంలు
    
నారాయణపేట జిల్లా మహిళల, పురుషుల జట్లు ఆడిన మ్యాచ్ లను అద్భు తంగా ఆడి అన్ని ఆటలో ప్రత్యర్థ టీంలను ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నా యి.ఉత్కంఠభరితంగా జరుగుతున్న పోటీలను తిలకించేందుకు క్రీడాభిమా నులు పెద్దఎత్తున తరలివచ్చి ఆటగాళ్లను ప్రోత్సహించా రు.మ్యాచ్ లను తిలకిం చడానికి వచ్చిన అభిమానుల కోసం గ్రౌండ్ లో ప్రత్యేక ఏర్పా ట్లను జిల్లా యూవజన క్రీడ సమైక్య ఆధ్వర్యంలో ఏర్పా టు చేసారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన స్పోర్ట్స్ అధికారి వెంకటేష్ శెట్టి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెట రీ శ్రీనివాస్ రెడ్డి, జిల్లాలోని పిడి లు నర్సిములు, రత్న య్య,బాలరాజ్ గౌడ్, వెంకట ప్ప,రామకృష్ణ రెడ్డి,అనంత సేన,ఊసు రవి,శ్రీధర్ గౌడ్, సాయినాథ్,మౌలాలి,రాజేశ్వరి, పరంజ్యోతి,రాజశేఖర్, నర్సింహారెడ్డి, విష్ణువర్ధన్, ఈశ్వర్,నరేష్,రూప,స్వరూప,రేణుక,పర్వీన్ బేగం మిగితా పిఈటి లు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్:7.కబడ్డీ ఆడుతున్న క్రీడాకారులు
______________________

Tags:

About The Author

Latest News

గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు. గంజాయి దందా చేస్తే ఉపేక్షించేది లేదు.
లోకల్ గైడ్/ తాండూర్ గంజాయి అక్రమ విక్రయాలు, రవాణాకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పెద్దేముల్ ఎస్సై ఎం. ప్రశాంత్ వర్ధన్ హెచ్చరించారు. ఆదివారం గంజాయి...
పాముకాటుతో మహిళ మృతి.
బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక తీజ్ పండుగ
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్రవేశాలు సెప్టెంబర్ 9 చివరి గడువు..
అత్తా పూర్ లో ఘనంగా కావడి యాత్ర.
తక్కువ ఖర్చుతో ప్రైవేట్ ఆసుపత్రులు పేదలకు మెరుగైన సేవలందించాలి 
శ్రావణ శోభలో ముత్యాలమ్మ బోనాలు