ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం:  నోరు అదుపులో పెట్టుకోవాలి.

హద్దులు దాటి మాట్లాడితే చర్యలు తప్పవు.

బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ పై తాజా కౌన్సిలర్ భర్త ధ్వజం. 
Published On
ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం:  నోరు అదుపులో పెట్టుకోవాలి.

లోకల్ గైడ్/తాండూర్
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ 16వ వార్డు కౌన్సిలర్ భర్త  నార శ్రీకాంత్ ధ్వజమెత్తారు. శుక్రవారం తాండూర్ పట్టణంలోనీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ  సందర్భంగా నారా శ్రీకాంత్ మాట్లాడుతూ...బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యేపై గానీ, చైర్ పర్సన్ పైన గాని వ్యక్తిగత విమర్శలు చేయడం తగదని అన్నారు. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి నీకు ఉందా శ్రీనివాస్ రెడ్డి?" అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకోవాలని చురకలంటించారు.గతంలో ఎమ్మెల్సీగా గెలిచింది కాంగ్రెస్ పార్టీ నుంచే అనే విషయం మర్చిపోవద్దని గుర్తు చేశారు. రాజకీయంలో విమర్శలు సహజం కానీ వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని,హద్దుల్లో ఉండాలని సూచించారు. ఆధారాలు లేకుండా, అదుపు లేకుండా మాట్లాడితే ప్రజలు సహించరని, అలాంటి వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు.ఈ సమావేశంలో కౌన్సిలర్ నారా శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మాజీ టౌన్ ప్రెసిడెంట్ అబీబ్ లాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం:  నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం:  నోరు అదుపులో పెట్టుకోవాలి.
బిఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ పై తాజా కౌన్సిలర్ భర్త ధ్వజం. 
ప్రజా సమస్యలను గాలికొదిలిన ఎమ్మెల్యే : సీపీఐ నాయకుడు పోతిరెడ్డి వెంకటరెడ్డి
నువా డైమండ్ ఆభరణాల కలెక్షన్ను ఆవిష్కరించిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కోకాపేటలో
నీట్ రీ పరీక్ష కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలు....
ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం కోసం అంగన్వాడీల కృషి అభినందనీయం -గుడిమల్కాపూర్ డైరెక్టర్ బండారి శంకర్
రవీంద్రభారతిలో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారు వి హెచ్ హనుమంతరావుకు ఘన సన్మానం 
8 ఏళ్ల బాలికకు వినికిడి పునరుద్ధరణ: