కొందుర్గు మండల అభివృద్ధికి సహకరించండి
డీకే అరుణమ్మకు పలు ప్రతిపాదనలు అందించిన బిజెపి మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి
లోకల్ గైడ్ -కొందుర్గ్
సోమవారం మహబూబ్ నగర్ డీకే అరుణమ్మ కార్యాలయంలో పాలమూరు ఎంపీ శ్రీమతి డీకే అరుణమ్మ ను కలిసి కొందుర్గు మండల అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేసిన బిజెపి కొందుర్గు మండల అధ్యక్షులు చిట్టెం లక్ష్మీకాంతరెడ్డి.
కొందుర్గు పీడబ్లుడి రోడ్డు నుండి గంగన్నగూడ, చెరుకుపల్లి, విశ్వనాథపురం మీదుగా తంగళ్ళపల్లి వరకు ఉన్న సింగిల్ రోడ్డును రెండు బ్రిడ్జీలతో కూడిన డబుల్ రోడ్డుగా విస్తరించుటకు విశ్వనాథపురం నుండి సంజీవపురం వెంకటేశ్వర స్వామి దేవాలయం, కొండోనిబాయి(లక్ష్మీదేవునిపల్లిమీదుగా కొల్లూరు వరకు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా బీటీ రోడ్డు నిర్మాణము చెరుకుపల్లి గ్రామంలో సర్వ శిక్ష అభియాన్ కార్యక్రమం కింద 300 మీటర్ల ప్రాథమిక పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణము
చెరుకుపల్లి ఎస్సీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణము గంగన్నగూడ బీసీ కమ్యూనిటీ హాల్ భవన నిర్మాణముపై ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన అరుణమ్మ తప్పకుండా పై పనులు చేపట్టేందుకు కృషిచేస్తానని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి గుండేటి శివారెడ్డి, సంజీవపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కమిటీ వైస్ చైర్మన్ లంకాల రామకృష్ణారెడ్డి, గంగన్నగూడ బిజెపి నాయకులు తూంపల్లి సత్యనారాయణ రెడ్డి, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.