చికెన్‌ను స్కిన్‌తో తినాలా.. వ‌ద్దా..

చికెన్‌ను స్కిన్‌తో తినాలా.. వ‌ద్దా..

ఒకప్పుడు నాటు కోళ్లను ఇళ్లలో ఎక్కువగా పెంచి పండుగలు, అతిథులు వచ్చినప్పుడు మాత్రమే వాడుకునే వేరే రుచిగా తినేవారు. కానీ ఈ రోజుల్లో పరిస్థితి మారింది. వారం వారం కాకపోయినా, వారం మధ్యలోనైనా ఎప్పుడైనా బ్రాయిలర్ చికెన్ తింటున్నవారి సంఖ్య ఎక్కువైంది. అయితే చాలా మంది చికెన్‌ను స్కిన్ లేకుండా తినడం అలవాటుగా మార్చుకున్నారు. ఎందుకంటే స్కిన్‌తో తినడం ఆరోగ్యానికి మంచిది కాదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిజానికి చికెన్‌ను స్కిన్‌తో తినడం మంచిదేనా? తింటే ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం.

 స్కిన్‌లోనూ మేలైన పోషకాలు:
చికెన్ స్కిన్‌లో మన శరీరానికి ఉపయోగపడే మంచి కొవ్వులు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇందులో మోనో అన్‌సాచురేటెడ్ కొవ్వులు, ముఖ్యంగా ఓలియిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాగే కొద్ది మొత్తంలో పాలీ అన్‌సాచురేటెడ్ కొవ్వులు కూడా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించి గుండెను రక్షిస్తాయి.

 క్యాలరీల విషయంలో:
చికెన్ స్కిన్‌లో కొంత శాచురేటెడ్ కొవ్వు ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైన కొవ్వులే ఎక్కువ. చికెన్ బ్రెస్ట్ పీస్‌ను స్కిన్‌తో తింటే, స్కిన్ లెస్ కంటే 30–50 క్యాలరీలే ఎక్కువగా వస్తాయి. అంతే తప్పగా ఎక్కువ కాలొరీల భారమేమీ ఉండదు. అలాగే చికెన్ స్కిన్‌లో ఉండే కొల్లాజెన్ చర్మం, జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

 ఎలా తినాలి?
స్కిన్‌తో సహా చికెన్ తింటే రుచి బాగా ఉంటుంది. పైగా వండేటప్పుడు అదనపు నూనె అవసరం తక్కువగా ఉంటుంది, ఎందుకంటే స్కిన్‌లోనే కొవ్వు ఉంటుంది. దీనివల్ల నూనె వాడకాన్ని తగ్గించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. స్కిన్‌తో తింటే కడుపు నిండినట్టు భావన కలిగి ఎక్కువగా తినకుండా ఉంటారు. ఇది బరువు తగ్గే వారికి తోడ్పడుతుంది.

 ఎవరికి తినరాదు?
అయితే అధిక బరువు ఉన్నవారు, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు, గుండె సమస్యలు లేదా కిడ్నీ సమస్యలు ఉన్నవారు చికెన్ స్కిన్ తినకూడదు. ఎందుకంటే స్కిన్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. అలాగే చికెన్‌ను డీప్ ఫ్రై చేయకుండా ఉడికించి లేదా సింపుల్‌గా వండుకొని తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, అవసరమైతే తగిన జాగ్రత్తలు పాటించి మాత్రమే చికెన్‌ను స్కిన్‌తో తినాలి.

Tags:

About The Author

Advertisement

Latest News

అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యేను ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ... అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యేను ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్)   అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించే యోగా దినోత్సవంలో పాల్గొనాలని నిజామాబాద్ అర్బన్ MLA దన్ పాల్ సూర్య నారాయణ...
ఈనాటి బాలలే రేపటి పౌరులు
అలరించిన చిరుతల   రామాయణం
పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్న టీఎస్ ఆర్టిసి
సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన
కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్  సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ 
నియోజకవర్గ ప్రజలకు, ప్రజా ప్రభుత్వానికి వారధిగా ఉంటాం