చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య కు ఆసుపత్రిలో డైట్ కాంట్రాక్ట్...జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష

చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య కు ఆసుపత్రిలో డైట్ కాంట్రాక్ట్...జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష

పెద్దపల్లి,- లోకల్ గైడ్

చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య కు ఆసుపత్రిలో డైట్ కాంట్రాక్ట్ కేటాయించామని  జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష తెలిపారు.బుధవారం  సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్ లో  జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య సభ్యులకు డైట్ కాంట్రాక్ట్ అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ,   మంథని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ , సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ , పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో రోగులకు అవసరమైన ఆహారం సరఫరా చేసేందుకు చైతన్య జ్యోతి జిల్లా మహిళా సమాఖ్య కు డైట్ కాంట్రాక్టు ఇవ్వడం జరిగిందని, ఈ కాంట్రాక్ట్ 2 సంవత్సరాల పాటు ఉంటుందని, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రకారం నాణ్యమైన పౌష్టికాహారం రోగులకు అందించాలని అన్నారు.ఈ  కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి ఎం.కాళిందిని, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

*ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ.. *ఇందూర్ జిల్లా కలెక్టర్ ను కలిసిన...అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్) : నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతన బాధ్యతలు చేపట్టిన టి. వినయ్ కృష్ణ రెడ్డిని ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు...
అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యేను ఆహ్వానించిన జిల్లా ఆయుష్ శాఖ...
ఈనాటి బాలలే రేపటి పౌరులు
అలరించిన చిరుతల   రామాయణం
పేద విద్యార్థుల నడ్డి విరుస్తున్న టీఎస్ ఆర్టిసి
సీసీ రోడ్డు, యుజిడీ పనులకు శంకుస్థాపన చేసిన
కళ్యాణ లక్ష్మి - షాదీ ముబారక్  సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ