డాన్ 3’లో నుపుర్ సనన్‌కి గోల్డెన్ ఛాన్స్!

డాన్ 3’లో నుపుర్ సనన్‌కి గోల్డెన్ ఛాన్స్!

‘డాన్’ సిరీస్‌ నుంచి ‘డాన్ 3’కి సన్నాహాలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో హీరోగా రణవీర్ సింగ్ ఫిక్స్ అయ్యాడు. హీరోయిన్‌గా మొదట కియారా అద్వాణీను ఎంపిక చేశారు కానీ ఆమె ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో ఆ స్థానాన్ని కృతి సనన్ భర్తీ చేస్తోంది.అయితే ఈ సినిమాలో సెకండ్ లీడ్ పాత్ర కూడా ఉందట. ఆ పాత్రకు కృతి తన సోదరి నుపుర్ సనన్ను తీసుకోవాలని కోరిందట. ఈ విషయం డైరెక్టర్‌కి నేరుగా చెప్పకుండా రణవీర్ సింగ్ ద్వారా ఫర్హాన్ అక్తర్కి తెలియజేసిందని టాక్. దీనిపై ఫర్హాన్ కూడా ‘‘ఆలోచించి చెబుతా’’ అని సమాధానం ఇచ్చాడట.నుపుర్ సనన్కి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్‌లో సరైన అవకాశం కోసం నుపుర్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది కానీ పెద్దగా బ్రేక్ రాలేదు. ఇంతవరకు ఒక హిందీ సినిమాలో మాత్రమే నటించింది. కొన్ని టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలకే పరిమితమైంది.నుపుర్ తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం ఉంది. రవితేజ హీరోగా నటించిన ‘టైగర్ నాగేశ్వరరావు’ చిత్రంలో ఆమె నటించింది. కానీ ఆ సినిమా ఫ్లాప్ కావడంతో నుపుర్ కష్టానికి ఫలితం రాలేదు. ఆ తర్వాత తెలుగులో కూడా ఆఫర్స్ రాలేదు.ఇప్పుడు ‘డాన్ 3’ సెకండ్ లీడ్ అవకాశం వస్తే నుపుర్‌కి కెరీర్ గీతే మార్చినట్లే. సాధారణంగా హీరోయిన్ ఎంపికలో డైరెక్టర్లు రాజీ పడరని తెలిసిన విషయమే. కానీ ఈసారి రికమండేషన్ పనిచేస్తుందో లేదో చూడాలి.ప్రస్తుతం నుపుర్ ఇన్‌స్టాగ్రామ్లో మాత్రం యాక్టివ్‌గా ఉంటూ హాట్ ఫొటోషూట్లతో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటోంది. అప్పుడప్పుడు అక్క కృతి సనన్ కూడా మద్దతుగా ఉండేలా కనిపిస్తుంది.

Tags:

About The Author

Advertisement

Latest News