బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక దక్షిణ భారత స్టార్‌గా చరిత్ర సృష్టించిన అరవింద్ కృష్ణ

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక దక్షిణ భారత స్టార్‌గా చరిత్ర సృష్టించిన అరవింద్ కృష్ణ

ముంబైలోని డోమ్‌లో జరిగిన మొట్టమొదటి బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో దక్షిణ భారత నటుడు, అథ్లెట్ అరవింద్ కృష్ణ సంచలనం సృష్టించారు. దిశా పటాని, బాద్షా, రణ్విజయ్ సింఘా, వరుణ్ సూద్ వంటి జాతీయ దిగ్గజాలు పాల్గొన్న ఈ ఆటలో దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన ఏకైక నటుడిగా అరవింద్ కృష్ణ నిలిచారు. మూడో నంబర్ జెర్సీ ధరించి కోర్ట్‌లో అడుగు పెట్టారు. గత ఏడాది మోకాలి గాయంతో బాధ పడిన అరవింద్ ఈ సారి మరింత శక్తివంతంగా తిరిగి వచ్చారు. అరవింద్ తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు అరవింద్ కృష్ట ప్రస్తుతం నటిస్తున్న ‘ఏ మాస్టర్ పీస్’ సినిమాని కూడా NBA ఇండియా అధికారిక స్పాట్‌లైట్ ప్రశంసించింది. అరవింద్‌ను పొగిడే క్రమంలో ఏ మాస్టర్ పీస్ అని కూడా అభివర్ణించారు. అరవింద్ కోర్టులో ఉన్న కమాండింగ్ ఉనికిని చూసి ఆర్గనైజర్స్ ఇలా ఏ మాస్టర్ పీస్ అని అతడ్ని కవిత్వాత్మకంగా ప్రశంసించారు. NBA నుండి ప్రేరణ పొందిన ఆ పసివాడు.. ఇప్పుడు ఏ మాస్టర్ పీస్ అంటూ సూపర్ హీరోగా తెరపైకి రాబోతోన్నారు.

Tags:

About The Author

Advertisement

Latest News

వర్షాల కోసం ఆశగా అన్నదాతల ఎదురుచూపు  వర్షాల కోసం ఆశగా అన్నదాతల ఎదురుచూపు 
మహబూబాబాద్ (లోకల్ గైడ్){రుతుపవనాల ప్రభావం తో  కురిసిన కొద్ది పాటి వర్షాలకి రైతులు  తొందరగా దుక్కులు దున్ని విత్తనాలు వేసిన రైతుకు ఆతరువాత వర్షాలు లేక  వేసిన...
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ను ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్న వాసరా ఎంటర్‌టైన్‌మెంట్..
బీచ్‌ లుక్‌తో మౌని రాయ్‌
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
అక్రమ బోర్ల ఫై చర్యలు తీసుకోవాలి - నీటి వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్ 
ఉలవలతో వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు!
కొత్తిమీర జ్యూస్‌ మరిచిపోకండి — ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!