పిస్తా పప్పు రోజూ తింటున్నారా? ఇంకా ఎందుకు ఆలస్యం..!
ఈ రోజుల్లో ఆరోగ్యంపై చాలా మందికి అవగాహన పెరుగుతోంది. వ్యాయామం చేయడం, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం మాత్రమే కాకుండా, పోషకాహారం తీసుకోవడానికీ చాలా మంది ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ పోషకాహారాల్లో పిస్తా పప్పు ఒక ముఖ్యమైనది.
పిస్తా పప్పును తినడానికి ఎక్కువ సమయం పడదు. ముందు నుంచే కొంత మొత్తంలో పిస్తాను పొంగని పెనంపై కొద్దిగా వేయించి, పింక్ సాల్ట్ చల్లి బాక్స్‌లో ఉంచితే సరిపోతుంది. రోజూ కావలసినప్పుడు గుప్పెడంత తింటే చాలు.
రోజుకు ఎంత తినాలి?
పోషకాహార నిపుణుల సిఫార్సు ప్రకారం రోజూ సుమారుగా 30 గ్రాముల పిస్తా పప్పు (అంటే సుమారుగా 20–25 పప్పులు) తింటే చాలును. ఇది శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ అందిస్తుంది.
ఏంటి లాభాలు?
పోషకాలు పుష్కలంగా:
పిస్తాలో విటమిన్ B6 ఎక్కువగా ఉంటుంది. ఇది రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది, నాడీ వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే విటమిన్ B1, E, పొటాషియం, ఫాస్ఫరస్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి.
యాంటీ ఆక్సిడెంట్లు:
లూటీన్, జియాజాంతిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పిస్తాలో ఉంటాయి. ఇవి కంటి చూపును రక్షిస్తాయి, చర్మానికి నయం ఇస్తాయి, కణాల నష్టాన్ని తగ్గిస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి దూరంగా ఉంటాయి.
గుండెకు రక్షణ:
పిస్తా పప్పు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. రక్తనాళాల్లో ఉండే కొవ్వు కరుగుతుంది. హార్ట్ బ్లాక్స్ రాకుండా చూసుకుంటుంది.
డయాబెటిస్‌కు మంచిది:
పిస్తాలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందువల్ల షుగర్ ఉన్నవారు కూడా భయపడకుండా తినవచ్చు. ఇందులోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్ లెవెల్స్‌ను నియంత్రిస్తాయి.
జీర్ణ వ్యవస్థకు మేలు:
పిస్తాలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థలో మంచిబ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.
బరువు తగ్గడానికి సహాయం:
పిస్తా పప్పు తింటుంటే ఆకలి తగ్గి, ఎక్కువ తినకుండా ఉండగలుగుతారు. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది.